తెలుగు రాష్ట్రాలకు అలర్ట్: మళ్లీ మొదలైన వానలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల పాటు పలు ప్రాంతాల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా.. గాలుల వేగం కూడా పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అనవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.

 జాతీయ ప్రాధాన్య కట్టడంగా తెలంగాణలోని 'గొల్లల గుడి'.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
జాతీయ ప్రాధాన్య కట్టడంగా తెలంగాణలోని 'గొల్లల గుడి'.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

అల్పపీడనం, రుతుపవన ద్రోణి ఎఫెక్ట్
ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరి ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు మరో రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండు తీవ్ర వాతావరణ వ్యవస్థల ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

AP Telangana Rain Alert Heavy Rains Expected From September 3 to 5 due to Depression Full Details Here

ఏపీలో వర్షాలు
ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉపరితల గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారనున్నందున సెప్టెంబర్ 3, 4 తేదీల్లో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం ధ్వంసం.. భారత్ ఫైర్!
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం ధ్వంసం.. భారత్ ఫైర్!

తెలంగాణలో చల్లబడిన వాతావరణం
తెలంగాణలో ఉత్తర, దక్షిణ జిల్లాల్లో గాలిలో తేమ శాతం ఎక్కువగా నమోదు కానుంది. ఆకాశం పొడవునా మేఘావృతమై ఉంటుందని.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మొత్తం మీద సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలలో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

మత్స్యకారులకు, ప్రజలకు జాగ్రత్తలు
సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో సెప్టెంబర్ 3,4 తేదీల్లో బంగాళాఖాతంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వర్షాలు, పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+