ఇరాన్ కు రష్యా సీక్రెట్ వెపన్.. అమెరికా యుద్ధనౌకలకు ఇక చుక్కలే..

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు ఉద్ధృతం అయ్యాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తో రష్యా చేతులు కలిపింది. C430L అనే కోడ్ తో సీక్రెట్ ప్రోగ్రామ్ కింద ఇరాన్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ కు రష్యా తన వంతు సాయం చేస్తోంది. ఈ సీక్రెట్ ప్రోగ్రామ్ 2023 లోనే ప్రారంభమైంది. ఇప్పుడు తుది దశకు చేరింది.

రామ్ జెట్ ప్రొపల్షన్ అనే టెక్నాలజీ కారణంగా ధ్వని కంటే వేగంగా ఇరాన్ మిసైల్స్ శత్రు దేశాలపైకి దూసుకెళ్లనున్నాయి. అలాగే లక్ష్యాలను బలంగా ఢీ కొట్టనున్నాయి. వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యల్లో భాగంగా ఇరాన్ కు రష్యా ప్రభుత్వం ఈ టెక్నాలజీని ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో అమెరికాకు ఇది బిగ్ షాక్ అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ది ఫైనాన్షియల్ టైమ్స్ అందించిన నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో ఇకపై అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ లు, వార్ షిప్ లు సంచరించడం కష్టంగా మారే ప్రమాదం ఉంది. ధ్వని కంటే వేగంగా లక్ష్యాలను ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ధ్వంసం చేసే అవకాశం ఉన్న తరుణంలో అమెరికాకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

రష్యా- ఇరాన్ మధ్య ఉన్న ఈ సీక్రెట్ ఒప్పందానికి C430L అని కోడ్ పేరు పెట్టారు. 2023 లోనే ఈ క్షిపణి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇక రామ్ జెట్ ప్రొపల్షన్ అనే వ్యవస్థను ఇరాన్ ఏళ్ల నుంచి అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ధ్వని కంటే వేగవంతమైన స్పీడ్ తో శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణులను ధ్వంసం చేయవచ్చు. అయితే ఈ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కోసం రష్యాలోని హై లెవెల్ అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే రష్యా డ్రోన్ ప్రోగ్రామ్ కు ఇరాన్ సాయం చేస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడుతున్నాయి.

Russia assists Iran in developing a supersonic cruise missile using ramjet propulsion technology

ఇక ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇరాన్ అధ్యక్షుడు మసూజ్ పెజెష్కియాన్ తో మాట్లాడుతూ.. ఇరాన్ కు రష్యా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని భరోసా ఇచ్చారు. అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ కష్ట కాలంలో ఉందని ఈ సమయంలో తాము ఇరాన్ కు సహాయం చేస్తామని పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు అటు చైనా కూడా ఇరాన్ కు తమ వంతు సాయం అందిస్తోంది. చైనా సాయంతో పొందిన హై- రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల ద్వారా మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైన్యం కదలికలను ఇరాన్ అంచనా వేస్తోంది. ఈ తాజా పరిణామాలు అమెరికాను మరింత ఇరకాటంలో పెట్టినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+