'లక్కీ భాస్కర్ 2' పై కీలక అప్డేట్.. వెంకీ అట్లూరి కామెంట్స్ వైరల్
ఇటీవలి కాలంలో ఓ ట్రెండ్ కొనసాగుతోంది. సినిమా హిట్ అయితే చాలు.. దానికి సీక్వెల్, ప్రీక్వెల్, పార్ట్ 2 ఎప్పుడూ అని ఫ్యాన్స్ గొడవ పెడుతుంటారు. అటు దర్శకులు, హీరోలు కూడా ఈ పార్ట్ 2 లను చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బాహుబలి సిరీస్ నుంచి ఈ విధానం ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తోంది. కానీ కొన్ని సినిమాలు మొదటి భాగం కంటే పెద్ద హిట్ అయినవి ఉన్నాయి. అలాగే ప్లాఫ్ అయినవీ ఉన్నాయి. ఏదేమైనా ఇటీవలి కాలంలో ప్రతి పెద్ద సినిమాకు పార్ట్ 2 ట్రెండ్ పెరిగిపోయిందని చెప్పాలి.
ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 2024 లో వచ్చిన 'లక్కీ భాస్కర్' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇందులోని సాధారణ డైలాగ్స్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు.. కేంద్రం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది.

ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ మాధ్యమంలో ఏకంగా 13 వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఓటీటీలో రిలీజ్ అయిన మొదటి వారంలోనే 15 కు పైగా దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్ లో చోటు దక్కించుకుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి పార్ట్ 2 ఉంటుందని తాజాగా ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. దీంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం 'ఐయామ్ గేమ్' ప్రమోషన్లలో భాగంగా దుల్కర్, వెంకీ అట్లూరి ఒకే వేదికపైన సందడి చేశారు.
And it’s OFFICIAL now..!!! #LuckyBaskhar2 is on the cards…
— Rangasthalam (@RangasthalamIN) September 2, 2026
This time, on a much bigger and grander scale.
Confirmed by #DulquerSalmaan and Director #VenkyAtluri. https://t.co/qpTjdAS9us pic.twitter.com/BFoE8rQ7vC
ఈ సందర్భంగా 'లక్కీ భాస్కర్' సినిమాకు సీక్వెల్ ను తీసుకువస్తానని వెంకీ అట్లూరి ప్రకటించగా.. ఈ ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని దుల్కర్ సల్మాన్ బదులిచ్చారు. అలాగే ఈ సీక్వెల్ అనౌన్స్ మెంట్ పట్ల తాను ఫుల్ ఆసక్తిగా ఉన్నానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఇటీవల రిలీజై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ పూర్తయిన నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ 2 స్క్రిప్ట్ పై దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications