Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జలసౌధలో ఏపీ, తెలంగాణా జలజగడం : రెండు బోర్డుల భేటీ ; కేఆర్ఎంబీ ముందు బలంగా వాదనలు !!

నదీజలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జల జగడాల నేపథ్యంలో ఈరోజు కేంద్రం జారీ చేసిన గెజిట్ పై సమీక్ష సమావేశానికి హాజరు కానున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి. ఈరోజు రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు తమ వాదనను బలంగా వినిపించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధిస్తూ నదీజలాల విషయంలో కృష్ణా నది బోర్డుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయగా, ఇక తొలి సారి కృష్ణా, గోదావరి బోర్డుల సమక్షంలో భేటీ కానున్నారు .

 హైదరాబాద్ జలసౌధలో కృష్ణా, గోదావరీ బోర్డుల భేటీ

హైదరాబాద్ జలసౌధలో కృష్ణా, గోదావరీ బోర్డుల భేటీ

కృష్ణా నదీ జలాల వివాదం, గోదావరి నదీ జలాల వినియోగం, కడుతున్న ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ అమలుపై హైదరాబాద్లోని జల సౌధలో ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలు కానున్న సమావేశంలో నీటి వాటాల పంపిణీ, ఇప్పటివరకూ చేసిన నీటి వినియోగం, అనుమతులు లేని ప్రాజెక్టుల నిలుపుదల అంశాలపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు తమ తమ వాదనలు వినిపించడానికి రెడీ అయ్యారు. ఇదే సమయంలో కేంద్రం తీసుకువచ్చిన గెజిట్ పై కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ రోజు నిర్వహించనున్న కృష్ణానది యాజమాన్య బోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో 13 అంశాలను ఎజెండా అంశాలుగా నిర్ణయించారు.

 2021-22 నీటి సంవత్సర నీటి వినియోగంపై చర్చ

2021-22 నీటి సంవత్సర నీటి వినియోగంపై చర్చ

అజెండా అంశాల విషయానికి వస్తే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 12వ బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించనున్నారు. కెఆర్ఎంబి లో ఖాళీగా ఉన్న నాలుగు పర్సనల్ సెక్రెటరీ ఒక సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహణకు విడుదల చేయాల్సిన బడ్జెట్ పై చర్చ జరపనున్నారు. 2021-22 నీటి సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వినియోగంపై నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది మిగులు జలాలను క్యారీ ఫార్వర్డ్ చేయాలా వద్దా అన్న దానిపై చర్చించనున్నారు. ప్రాజెక్టులన్నీ నిండాక సర్ ప్లస్ అయ్యే నీటిని ఇరు రాష్ట్రాలు ఏ ప్రాతిపదికన వినియోగించుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

కృష్ణా బోర్డును హైదరాబాద్ నుండి వైజాగ్ కు తరలింపుపై చర్చ

కృష్ణా బోర్డును హైదరాబాద్ నుండి వైజాగ్ కు తరలింపుపై చర్చ

కేంద్రం విడుదల చేసిన గెజిట్ అమలుకు ఏర్పాటు చేయాల్సిన అధికార వ్యవస్థతో పాటుగా, ఇప్పటికే నడుస్తున్న అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవడంపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుదుత్పత్తి ,మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చ జరపనున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విశాఖ తరలించడంపై కూడా చర్చించనున్నారు. అంతేకాదు గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలించి కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీల కేటాయింపుపై ఈరోజు భేటీలో చర్చించనున్నారు.

ఇప్పటికే లేఖలు రాసిన అనేక అంశాలపై బలంగా వాదించనున్న ఏపీ

ఇప్పటికే లేఖలు రాసిన అనేక అంశాలపై బలంగా వాదించనున్న ఏపీ

ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో చోటుచేసుకున్న అనేక సమస్యలకు పరిష్కారం వెతకటానికి రెండు రాష్ట్రాలు ఈరోజు ప్రయత్నించే అవకాశం ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని, ఆ విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో బచావత్ కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిందని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు పైన ఇంక ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని , ఇలాంటి సమయంలో తెలంగాణా ప్రతిపాదించిన 50: 50 ఫార్ములా సమంజసం కాదనివాదించనుంది.

తెలంగాణా అభ్యంతరం వ్యక్తం చేస్తున ప్రాజెక్ట్ లపై వాదనలు

తెలంగాణా అభ్యంతరం వ్యక్తం చేస్తున ప్రాజెక్ట్ లపై వాదనలు

వాస్తవానికి ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికన చేపట్టాలనిఏపీ ప్రభుత్వం కోరనుంది . ఇక దీనిపై కూడా బలంగా తమ వాదన వినిపించే అవకాశం కనిపిస్తుంది. గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్ కు తరలింపు అంశంపై కూడా చర్చించనుంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టులు చిన్నతరహా ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోల అంశాన్ని కూడా ఏపీ సర్కార్ చర్చించనుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాజెక్టులను కాలువలను బోర్డుల పరిధి నుండి తప్పించాలని కూడా కోరనుంది. వెలిగొండ ప్రాజెక్టు ను గెజిట్లో అనుమతి కలిగిన ప్రాజెక్టుగా సవరించాలని ఏపీ డిమాండ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది.

Recommended Video

    Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Oneindia Telugu
    ఏపీ నీటి వినియోగాన్ని, రాయలసీమ ప్రాజెక్ట్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణా వాదన

    ఏపీ నీటి వినియోగాన్ని, రాయలసీమ ప్రాజెక్ట్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణా వాదన

    ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం నదీ జలాల పంపకాలలో 50 శాతం వాటా ఉండాలని కోరే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఈరోజు భేటీలో గట్టిగానే తమ వాదనలు వినిపించాలని తెలంగాణా సర్కార్ భావిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకోవాలని భావిస్తుంది. ఇక శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఏపీకి ఈరోజు భేటీ ద్వారా గట్టిగా సమాధానం చెప్పాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇక ఈ సమావేశంలోనే రెండు రాష్ట్రాల్లో నదీజలాల పరిధిపై, కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని పలు అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయనున్నాయని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కృష్ణా, గోదావరి రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+