హనుమాన్ ఆలయానికి రూ. కోటి పెద్ద నోట్లు విరాళం

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చెయ్యడంతో దేవాలయాలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక దేవాలయంలో భారీ మొత్తంలో హుండీలో కానుకలు సమర్పించడంతో ఆలయం నిర్వహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చెయ్యడంతో దేవాలయాలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక దేవాలయంలో భారీ మొత్తంలో హుండీలో కానుకలు సమర్పించడంతో ఆలయం నిర్వహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని మాచవరంలో శ్రీ దశాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. గత నెల నుంచి ఈ దేవాలయానికి రూ. 1 కోటి ఐదు లక్షల రూపాయలు భారీగా విరాళం వచ్చింది.

AP Temple receives massive donations in R.1,000, Rs. 500 notes

హుండీ లెక్కించిన ఆలయం నిర్వహకులు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల దాదాపుగా భక్తులు రూ. 1,50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు విరాళం ఇస్తుంటారని ఆలయ పూజారి రామక్రిష్ణ మాచార్యులు అంటున్నారు.

ఇప్పుడు వచ్చిన భారీ విరాళంతో ఆలయాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తామని ఆలయ నిర్వహాణాధికారి సాంబశివరావు చెప్పారు. ఆంజనేయ స్వామికి వచ్చిన ఒక కోటీ ఐదు లక్షల రూపాయలు అన్ని రూ. 1,000, రూ.500 నోట్లు అని ఆలయ నిర్వహకులు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు కావడంతో స్వామివారికి ఈ విధంగా కానుకలు సమర్పించుకుంటున్నారని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+