స్విస్ ఛాలెంజ్‌పై జగన్ కంటే రెండాకులు ఎక్కువే: 'ఇక్కడి దొంగలే సింగపూర్ పేరుతో..'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా, సీపీఎం నేత రాఘవులు వైసిపి కంటే ఓ అడుగు ముందుకు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేదల భూములే
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం కేవలం పేదల భూములే సేకరిస్తున్నారని రాఘవులు మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో భూమి విలువలు పెంచి భూసేకరణ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

స్విస్ ఛాలెంజ్‌కు ఇక్కడి దొంగలే
స్విస్ ఛాలెంజ్ కోసం వచ్చేది సింగపూర్ వాళ్లు కాదని, ఇక్కడి దొంగలే సింగపూర్ ద్వారా వస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా వైసిపి కంటే ఓ అడుగు ముందుకేశారు. బోగస్ విద్యా సంస్థలకు ఇక్కడ భూములు ఇవ్వడం సరికాదన్నారు.

జగన్ కంటే రెండాకులు ఎక్కువే
కాగా, ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా అమరావతిని నిర్మించనున్న విషయం తెలిసిందే. దీనిపై వైసిపి మొదటి నుంచి మండిపడుతోంది. మన దేశంలో మంచి ఇంజినీర్లు ఉండగా సింగపూర్‌కు, జపాన్‌కు, చైనాకు రాజధాని నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వైయస్ జగన్
రాజధాని పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలకు తెరలేపుతోందని ఆరోపిస్తున్నారు. ఇతర దేశాలకు రాజధాని నిర్మాణ బాధ్యతలు ఇచ్చి, కమీషన్ కొట్టేసేందుకు ఇదంతా అని మండిపడుతున్నారు. ఇప్పుడు రాఘవులు ఏకంగా.. అసలు సింగపూర్ పేరుతో ఇక్కడి వారే వస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications