ఏపీ టూ హైదరాబాద్: కూరగాయల వ్యాన్ కు ఎస్కార్ట్; చెక్ చేస్తే 400కేజీల గంజాయి !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జగన్ ప్రభుత్వానికి గంజాయి సమస్య పెద్ద సమస్యగా తయారైంది. ఎక్కడ చూసినా గంజాయి కేసులు పట్టుబడుతుండడం, ఇతర రాష్ట్రాలు సైతం గంజాయి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వేలెత్తి చూపడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. దేశవ్యాప్తంగా ఏపీ గంజాయిపై ఇంత పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నా విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారు.

నిత్యావసర వస్తువుల మాటున గంజాయి స్మగ్లింగ్
నిన్నటికి నిన్న కొబ్బరికాయల మాటను గంజాయి అక్రమ రవాణా జరుగుతుంటే పట్టుకున్న పోలీసులు రెండు వేల కిలోల గంజాయిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కూరగాయల మాటున తరలుతున్న గంజాయిని పట్టుకున్నారు తురబాల గెడ్డ సమీపములో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలో గంజాయి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువు లాగా గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా అవుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో పట్టుకుంటున్న గంజాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఏపీలో గంజాయి సాగు ఎంతగా సాగుతుందో అర్థమయ్యేలా చెబుతున్నాయి.

కూరగాయల వ్యాన్లో గంజాయి అక్రమ రవాణా
గత 15 రోజుల నుంచి నిత్యం విశాఖ ఏజెన్సీ నుంచి తరలే వాహనాలపై పెద్ద ఎత్తున నిఘా పెట్టినా కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందంటే ఎంత తీవ్రమైన సమస్యగా ఏపీకి గంజాయి సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం రోజు కొయ్యూరు మండలం తురబాల గెడ్డ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యాన్లో తరలిస్తున్న 400 కిలోల గంజాయి పట్టుబడింది. కూరగాయల వ్యాన్లో గుట్టుచప్పుడు కాకుండా కూరగాయల మాటున వీటిని రవాణా చేస్తుండగా తనిఖీలు చేసిన అధికారులు పట్టుకున్నారు.

లోతుగెడ్డ జంక్షన్ నుండి హైదరాబాద్ కు తరలుతున్న గంజాయి సీజ్.. నలుగురు అరెస్ట్
ఇక కూరగాయల వ్యాన్ లాగా బయటకు వెళుతున్న ఈ గంజాయి వ్యాన్ కు ఫాలోవర్స్ గా రెండు మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరిని గుర్తించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వారిని అరెస్ట్ చేశారు. కూరగాయల మాటున తరలుతున్న గంజాయి చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్ లో లోడ్ చేసి హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. తరలింపు వ్యవహారానికి సంబంధించి రెండు బైకులు, ఒక వ్యాన్, 400 కిలోల గంజాయిని సీజ్ చేసిన అధికారులు, నలుగురిపై కేసు నమోదు చేశారు. కాకినాడ కు సంబంధించిన ఇద్దరూ హైదరాబాద్ కు సంబంధించిన ఒక రూ చింతపల్లి కి చెందిన మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి మూడు సెల్ ఫోన్లు, 18 వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Recommended Video

ఏపీ గంజాయి దందా .. జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు టార్గెట్
గంజాయి స్మగ్లింగ్ కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా,అధికారులు నిత్యం వాహన తనిఖీలు చేపడుతున్నా గంజాయి స్మగ్లింగ్ మాత్రం కట్టడి కావడం లేదు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు ఏపీ గంజాయి హబ్ గా మారిపోయిందని ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితులు నిత్యం చోటుచేసుకున్నాయి. మరో పక్క రాష్ట్రమైన తెలంగాణలోనూ ఏపీ గంజాయి పై పోలీసు అధికారులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణానే కాదు, గంజాయి సాగును అరికట్టకుంటే ముందు ముందు ఏపీ ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ గంజాయి స్మగ్లింగ్ కు అడ్డాగా మారితే అసాంఘిక శక్తుల ప్రభావం ఏపీలో పెరిగిపోతుంది. ఏపీ ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications