రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఇది!.. లంచంలో ఏపీలోనే సరికొత్త రికార్డు!!
ఏపీలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఒక సంచలనాత్మకమైన కేసును ఛేదించి రాష్ట్రప్రభుత్వ యంత్రాంగంలో పాతుకుపోయిన అవినీతిని మరోసారి బయటపెట్టింది. పదవీ విరమణకు కేవలం మూడు వారాల ముందు భారీ అవినీతికి పాల్పడిన గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ వలకు చిక్కారు. ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద లంచం కేసుల్లో ఒకటిగా నిలిచిపోయింది.ఉన్నతాధికారి ఇంత మొత్తంలో లంచం డిమాండ్ చేయడం, దాని కోసం ఒక పక్కా ప్లాన్ చేసి చివరకు పట్టుబడటం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఓ పనికి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ఆ అధికారి నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఈ భారీ లంచం కుంభకోణం వివరాలు ఇలా ఉన్నాయి. ఏకలవ్య పాఠశాలల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్న సత్యసాయి కన్‌స్ట్రక్షన్ అధినేత కృష్ణంరాజుకు ప్రభుత్వం నుంచి రూ.35.5 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఈ బిల్లుల విడుదలకు గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ అబ్బవరపు శ్రీనివాస్ అడ్డుపడి, వాటిని క్లియర్ చేయడానికి ఏకంగా రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఈ భారీ మొత్తం విని షాక్ అయిన కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు లంచం డీల్‌లో భాగంగా శ్రీనివాస్‌కు టోకెన్ అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు ఇస్తుండగా.. విశాఖపట్నం, విజయవాడ ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీనివాస్ మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ కాబోతున్నాడు. ఈ నెలాఖరుకు పదవి నుంచి దిగిపోబోతున్న శ్రీనివాస్.. రిటైర్మెంట్‌కు ముందు వీలైనంతం ఎక్కువ అక్కమ సంపాదనను పోగేసుకోవాలని భావించి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. అయితే అతని ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన సమయంలో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన అవినీతికి పాల్పడిన వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా చివరికి చట్టానికి చిక్కక తప్పదని నిరూపించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఓ హెచ్చరికగా నిలుస్తుంది.
గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ అబ్బవరపు శ్రీనివాస్ అరెస్ట్ అనంతరం ఏసీపీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ చరిత్రలో ఇంత మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన సందర్భం లేదన్నారు. శ్రీనివాస్‌పై అనేక అవినీతి ఆరోపణలు, అక్రమాస్తుల కేసులో ఉన్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ తన తీరును మార్చుకోలేదని తెలిపారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమేనని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటి చెప్పింది. 10 లక్షలకు పైగా లంచం తీసుకున్న కేసులో అరుదుగా ఉండగా.. ఏకంగా కోట్లలో లంచం డిమాండ్ చేసి ఓ ఉన్నతాధికారి దొరికిపోవడం సంచలనం సృష్టించింది. ఈ కేసు ఏసీబీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సంఘటన ప్రభుత్వ యంత్రాంగంలో నిఘా పెంచాల్సిన అవసరం గురించి స్పష్టం చేస్తోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications