వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ స్టేట్.. వన్ నెంబర్... ఇకపై ఏపీ వాహనాలకు 39 సిరీస్

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీ రవాణా శాఖ సరికొత్త నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. వన్ స్టేట్.. వన్ నెంబర్ విధానాన్ని తెరపైకి తీసుకురానుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఒకే సిరీస్ తో ఉండనున్నాయి. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రమంతటా ఏపీ 39 సిరీస్ తో ఒకటే పాలసీ అమలుకానుంది. అన్ని జిల్లాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లకు ఇది వర్తించనుంది.

కొత్త విధానం అమలుతో వాహనాలను ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యముంటుంది. అయితే వన్ స్టేట్.. వన్ నెంబర్ విధానం అమలుచేస్తే రవాణాశాఖకు ఆదాయం పెరుగుతుందనేది ఒక అంచనా. అంతేగాకుండా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి డబ్బుతో పాటు సమయం ఆదా అవుతుందనేది ప్రభుత్వం మాట.

ap vehicle registration series changed to 39

తొలుత AP 39 - A0001 నుంచి AP 39 - A9999 సిరీస్ లో నెంబర్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం AP 39 - B0001 నుంచి AP 39 B9999, అలా ఏ టూ జడ్ సిరిస్ లో వాహనాల నెంబర్లు ఇవ్వనున్నారు. ఏపీ 39 సిరీస్ ముగిశాక ఏపీ 40 సిరీస్ మొదలవుతుంది. అయితే టి, యు, వి, డబ్ల్యు, ఎక్స్, వై సిరీస్ లను రవాణా వాహనాలకు, జెడ్ సిరీస్ ను ఏపీఎస్ఆర్టీసీకి కేటాయించనున్నారు.

English summary
one state one number implementing in andhra pradesh,ap vehicle registration rules changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X