Viral Video: అర్ధరాత్రి భారీ వర్షంలో మంత్రి రామానాయుడు-బుడమేరు గండ్ల పూడిక..!

విజయవాడకు వచ్చిన భారీ వరదలకు బుడమేరు వాగు గండ్లే ప్రధాన కారణమయ్యాయి. వెలగలేరు నుంచి వచ్చిన వరద నీరు ఈ గండ్ల వల్లే నగరంలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్ని ముంచెత్తింది. దీంతో రెండున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ భారీ ఉత్పాతానికి కారణమైన బుడమేరు గండ్లను పూడ్చే పనుల్ని ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోంది. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఈ పనులు చేయిస్తున్నారు.

ఇదే క్రమంలో నిన్న అర్ధరాత్రి మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులు పర్యవేక్షించేందుకు వెళ్లారు. అర్ధరాత్రి అయినా అక్కడే ఉండి పనులు చేయించారు. అదే క్రమంలో భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా పూర్తిగా తడిసిపోయినా పట్టించుకోలేదు. ఈ గండ్లను వెంటనే పూడ్చకపోతే తిరిగి భారీ వర్షం పడితే పరిస్ధితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న నేపథ్యంలో మంత్రి రామానాయుడు ఇలా సిబ్బందితో సమానంగా క్షేత్రస్ధాయిలో విధుల్లో పాల్గొన్న వీడియో ఆయనే స్వయంగా ఎక్స్ లో పోస్టు చేశారు.

ap water resources minister supervised budameru canal water stoppage works in rain-video viral

బుడమేరుకు దాదాపు 10 చోట్ల గండ్లు పడ్డాయని, వీటిని త్వరితగతిన పూడ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ గండ్లు పూడ్చకపోతే విజయవాడలో ముంపు ప్రాంతాలకు ఉపశమనం ఇవ్వలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గండ్లను పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రామానాయుడు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+