AP Weather: రేపు ఈ జిల్లాలతో వర్షాలు మొదలు- ఎల్లుండి అల్పపీడనం..!

ఏపీకి వాతావరణ విభాగం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో వర్షాలు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలకు ఊరటనిచ్చేలా వాతావరణంపై (AP Weather) కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?
ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?

బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ తర్వాతి 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తిరిగిరావాలని సూచిస్తోంది.
అలాగే రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

AP Weather Alert Rain Likely Tomorrow Ahead of Low-Pressure Formation Over Bay of Bengal
నామినేషన్లపై వైసీపీకి మరో గుడ్ న్యూస్..! ఎస్ఈసీ కీలక నిర్ణయం..!
నామినేషన్లపై వైసీపీకి మరో గుడ్ న్యూస్..! ఎస్ఈసీ కీలక నిర్ణయం..!

ఎల్లుండి నుంచి ఈ వర్షాలు మరింత పెరకబోతున్నాయి. ఇవి కాస్తా ఆదివారం నాటికి భారీ వర్షాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అనే దానిపై ఆదివారం నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆదివారం కల్లా కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలతో పాటు మత్సకారుల్ని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరుతోంది. ఈ నెలాఖరు కల్లా కోస్తాంధ్రలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+