AP Weather : వడగాల్పుల హెచ్చరికలు-102 మండలాల్లో -14 చోట్ల తీవ్రంగా-ఎక్కడెక్కడంటే ?
ఏపీలో వడగాల్పులు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే వేసవి ఉక్కపోతతో జనం సతమతం అవుతుండగా.. ఇప్పుడు వేడి గాల్పులు కూడా పెరిగాయి. రాబోయే కొన్ని రోజుల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరికలు విడుదల చేసింది.
రాష్ట్రంలోని 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు తప్పవని విపత్లుల నిర్వహణ సంస్ధ ప్రకటించింది. మొత్తం 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతంది. ఎండ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

రాష్ట్రంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలను విపత్తుల నిర్వహణ సంస్ధ ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకుంటే అల్లూరిసీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాల్లో వడగాల్పులు తప్పేలా లేవు.
అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం మండలాలు, కాకినాడ జిల్లాలో కోటనందూరు, పల్నాడు జిల్లాలో అమరావతి మండలం, పార్వతీపురంమన్యం జిల్లాలో భామిని,కొమరాడ, గుమ్మలక్ష్మీపురం,కురుపాం, సాలూరు మండలాలు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది.
జిల్లాల వారీగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల సంఖ్య వివరాలు కూడా సంస్ధ వెల్లడించింది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 12 మండలాలు, అనకాపల్లిలో 11 మండలాలు , పల్నాడులో 11 మండలాలు , వైఎస్ఆర్ జిల్లాలో 11 మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 8 మండలాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల మొత్తం 102 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని
విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు.












Click it and Unblock the Notifications