వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన జరిగే అవకాశాల్లేవు, కిరణ్ కొత్త పార్టీ: పార్థసారథి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు కనిపించడం లేదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టవచ్చునని మంత్రి పార్థసారథి బుధవారం అన్నారు. ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన నిమిషాల్లోనే వాయిదా పడింది. సభలో సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించారు. సభ్యులు జై తెలంగాణ, జై సమైక్యాంద్ర నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభాపతి సభను గంటపాటు వాయిదా వేశారు. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ టిడిపి, సమైక్య తీర్మానం కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, పాలెం బాధితులకు పరిహారం, ప్రయివేటు బస్సు ఆపరేటర్లపై చర్యలు కోరుతూ సిపిఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాటిని సభాపతి తిరస్కరించారు.

సభ వాయిదా అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. విభజన జరగదనిపిస్తోందని, కిరణ్ కొత్త పార్ట పెట్టే అవకాశముందన్నారు. జగన్ విభజనకు సహకరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టరని, ఆయన నిబద్దత గల కాంగ్రెసు కార్యకర్త అని ఎపి పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగే చెప్పారని, తెలంగాణ రావడం ఖాయమని మంత్రి డికె అరుణ అన్నారు.

దాడుగుమూతలు

ప్రభుత్వం తెలంగాణ ముసాయిదా బిల్లు పైన దాగుడుమూతలు ఆడుతోందని టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రాష్ట్ర విభజన అంశాన్ని రహస్య అజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ నుండి సస్పెండ్ అయ్యేందుకు నాటకాలాడుతోందని దేవినేని ఆరోపించారు.

English summary
Minister Parthasarathi on Wednesday said Andhra Pradesh will not divided.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X