జగన్ ఓ అప్పుల అప్పారావు- ఆ కార్యదర్శికి కేంద్రం చీవాట్లు- పీసీసీ ఛీఫ్ షాకింగ్ కామెంట్స్
ఏపీలో వైసీపీ సర్కార్ విచ్చలవిడిగా చేస్తున్న అప్పులపై విపక్షాలు మండిపడుతున్నాయి. అటు కేంద్రం కూడా అప్పుల లెక్కలు సరిగ్గా చెప్పడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజాగా ఢిల్లీలో ఆర్దికమంత్రి బుగ్గనను బయట కూర్చోబెట్టి మరీ ఆర్దికశాఖ కార్యదర్శి రావత్ ను కేంద్ర అధికారులు చీవాట్లు పెట్టారని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీసీసీ ఛీఫ్ శైలజా నాథ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
కర్నూల్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన పీసీసీ ఛీఫ్ శైలజానాథ్.. ఏపీ సర్కార్ చేస్తున్న అప్పులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అప్పుల అప్పారావుగా మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను గది బయట కూర్చోబెట్టి మరీ ముఖ్య కార్యదర్శి రావత్ ను కేంద్ర అధికారులు చీవాట్లు పెట్టారని ఆరోపించారు. ఈ ఘటనతో ఏపీ మర్యాదను సీఎం జగన్ మంటగలిపారని శైలజానాథ్ విమర్శించారు.

సీఎం జగన్ ప్రజల్ని అడుక్కునే వాళ్లుగా మారుస్తున్నారని పీసీసీ ఛీఫ్ శైలజానాథ్ విమర్శించారు. ప్రజలకు లక్షా 30 వేల కోట్లు పంచామని చెప్తున్న ప్రభుత్వం.. అందులో రూ.70వేల కోట్లకు మాత్రం లెక్కలు చెప్పకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు రోషం ఉంటే పదవికి రాజీనామా చేయాలని పీసీసీ ఛీఫ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆర్ధికశాఖ కార్యదర్శికి చీవాట్లు పెట్టేందుకు మంత్రిని బయటకు పంపారంటేనే పరువుపోయిందని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు జగన్ భజనరాయుళ్లుగా మారిపోయారన్నారు. ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వం ధర నిర్ణయిస్తోందన్నారు. వైజాగ్ ఎల్జీ పాలీమార్స్‌లో ప్రమాద బాధితులకు కోటి ఇచ్చి, అత్యాచార బాదితులకు మాత్రం రూ.5 లక్షలు ఇస్తారా అని శైలజానాథ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications