మోడీ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్- ఉగ్రదాడి కేంద్రం వైఫల్యమే- షర్మిల షాకింగ్..!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి, ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా మోడీ కోసం పని చేస్తుందన్నారు. మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పని చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ ఘటన కు బాధ్యులు మోడీ,అమిత్ షా అన్నారు. వీళ్లిద్దరూ తక్షణం రాజీనామా చేయాలన్నారు.
పహల్గాంలో జరిగింది మనం దేశం మీద జరిగిన దాడి అని షర్మిల తెలిపారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని, పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని షర్మిల తెలిపారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారన్ను. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమే అన్నారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్ళు లేనే లేరన్నారు.

ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు లేనే లేరని షర్మిల తెలిపారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమే అన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీ పై ఉందన్నారు. మోడీ చౌకిదార్ అని చెప్పుకుంటున్నారని, ఇదేనా చౌకిదార్ తనం అని నిలదీశారు. ఈ ఘటనకు అమిత్ షా, మోడీ బాధ్యత వహించాలన్నారు. దీనికి బాధ్యతగా వీళ్లిద్దరూ రాజీనామాలు చేయాలన్నారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు.
ఇవ్వాళ దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పని చేయడం లేదని, ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నా వాళ్ల మీద వాడుతున్నారని షర్మిల ఆరోపించారు. బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద వాడుతున్నారన్నారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణం అన్నారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీ కి చౌకీదార్లు అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. నిఘా వ్యవస్థ బలం అంతా మోడీ కోసం పని చేస్తుందని, దేశ భద్రతను గాలికొదిలేశారని ఆరోపించారు.

ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని, దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని,ఈ దేశంలోనే ఇంటర్నల్ గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications