Nara Lokesh : ఆరున్నర గంటల్లో లోకేష్ కు 50 ప్రశ్నలు- చివర్లో థ్యాంక్స్-మళ్లీ రేపు రమ్మంటూ..

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఇవాళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ నేత నారా లోకేష్ ను దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించారు. ఇందులో ఆయన్ను అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మధ్యలో ఓ గంట లంచ్ బ్రేక్ ఇచ్చి మిగతా సమయంలో ప్రశ్నలు అడిగారు. న్యాయవాది సమక్షంలోనే జరిగిన ఈ విచారణపై బయటికి వచ్చిన తర్వాత నారా లోకేష్ వివరాలు వెల్లడించారు.

ఇవాళ సీఐడీ విచారణలో తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారని నారా లోకేష్ తెలిపారు. ఇందులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేవలం ఒకే ప్రశ్న అడిగారని, మిగతా ప్రశ్నలు ఇతరత్రా అంశాలపైనే అడిగారని తెలిపారు. దాదాపు ఆరున్నర గంటల పాటు విచారణ సాగిందన్నారు. 50 ప్రశ్నల్లో ఒక్కటి కూడా కుటుంబ సభ్యులకు ఎలా లబ్ది జరిగిందని అడగ లేదన్నారు. హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని లోకేష్ తెలిపారు.

apcid ask 50 questions to nara lokesh in six and half hours in amaravati irr case inquiry today

హెరిటేజ్ కు సంబందించిన పదవులు,ప్రభుత్వంలో ఏయే పదవుల్లో ఉన్నారని అడిగినట్లు లోకేష్ వెల్లడించారు. అలాగే విచారణలో తాను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, సహకరించినందుకు విచారణ అధికారి థ్యాంక్స్ కూడా చెప్పారని లోకేష్ తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలు కూడా అడిగినట్లు లోకేష్ వెల్లడించారు. క్ష సాధింపు తప్ప...ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్ లు పెట్టారని ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని విమర్శించారు. ఇవాళ విచారణ తర్వాత మళ్లీ రేపు విచారణకు రావాలని 41ఏ నోటీసు ఇచ్చినట్లు లోకేష్ తెలిపారు. రేపు కూడా విచారణకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

టీడీపీ నాయకులపై దొంగ ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అలాగే బ్రాహ్మణి, భువనేశ్వరిని కూడా అరెస్టు చేస్తామని ప్రచారం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. గవర్నర్ అనుమతి లేకుండా ఎందుకు చంద్రబాబు ను అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అరగంట,గంట మంత్రుల కామెంట్స్ కు తాను సమాధానం చెప్పబోనని మంత్రి అంబటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలవరం ఎందుకు కట్టలేదో ముందు అంబటి సమాధానం చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+