లోకేష్ రెండోరోజు విచారణలో ట్విస్ట్ లు-తెరపైకి భువనేశ్వరి రిటర్న్స్-గూగుల్ మ్యాప్ లు...

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుందని చెబుతున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో టీడీపీ నేత నారా లోకేష్ ను సీఐడీ ఇవాళ వరుసగా రెండోరోజు విచారించింది. లాయర్ సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించిన సీఐడీ తమ పని పూర్తి చేసింది. హైకోర్టు లోకేష్ ను ఒక్క రోజు విచారించాలని చెప్పినా సీఐడీ మాత్రం రెండో రోజు కూడా రమ్మని పిలవడం, ఆయన హాజరు కావడం జరిగిపోయాయి. దీంతో విచారణ ముగిసింది.

రెండో రోజు సీఐడీ విచారణ ముగించుకుని బయటికి వచ్చి నారా లోకేష్.. ఇవాళ ఏం జరిగిందో వెల్లడించారు. హైకోర్టు ఒక్కరోజు అని చెప్పినా సీఐడీ నోటీసుతో రెండో రోజు కూడా హాజరయ్యానని లోకేష్ తెలిపారు. మొత్తం 6 గంటలపాటు విచారణ చేశారని వెల్లడించారు. నిన్నటి ప్రశ్నలే ఈరోజు అడిగారన్నారు. కొత్తగా ఆధారాలు పెట్టలేదు, ప్రశ్నలు అడగలేదన్నారు. మొత్తం 47 ప్రశ్నలలో ఒకట్రెండు తప్ప అన్నీ నిన్న ఆడిగినవే అని లోకేష్ తెలిపారు.

apcid questions nara lokesh with bhuveswari it returns, google maps in irr case on second day

సీఐడీ అధికారులు విచారణలో తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ముందు పెట్టారని లోకేష్ తెలిపారు. తన తల్లి ఐటీ రిటర్న్స్ ఎలా వెళ్లాయనే దానిపై సీరియస్ గా తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులు కానీ వారి ఐటీ వివరాలు ఎలా బయటికి వచ్చాయి అనే దానిపై ఐటీ అధికారులకు లేఖ రాస్తామన్నారు. తన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు పదేపదే అడిగారని లోకేష్ తెలిపారు. జీవో 282 గురించి ప్రస్తావించారని, కోర్టు ఆదేశాలతో 99 మందికి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పానన్నారు. లంచ్ కు ముందు తనకు బాహుబలి సినిమా చూపించారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల హెరిటేజ్ భూమి పోతుందన్నారు.

స్కిల్ స్కాం లో కీలకమైన అజయ్ కల్లం, ప్రేమ చంద్రా రెడ్డి ని ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని లోకేష్ ప్రశ్నించారు.విధానపరమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారా? అని అడిగారు. తనకు హెరిటేజ్ తో పాటు అనేక కంపెనీల్లో షేర్లు ఉన్నాయన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి రాజకీయ కక్షతో చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి గా ఇవ్వాల్సిన సదుపాయాలు జైల్లో ఇవ్వడం లేదన్నారు. 32 రోజుల నుంచి అన్యాయంగా జైల్లో పెట్టారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+