వివేకా హంతకులెవరో చెప్పేసిన దస్తగిరి ? కోర్టులో కీలక వాంగ్మూలం-మరిన్ని సంచలనాలు!
ఏపీలో పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అంతకు మించిన సంచలనాలతో ముగిసేలా కనిపిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ఇప్పటికే కీలక నిందితులను గుర్తించినప్పటికీ వారిని దోషులుగా నిరూపించగల ఆధారాల సేకరణలో ఆలస్యమవుతోంది. దీంతో ఈ కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు, వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో రెండో వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టులో రికార్డు చేయించింది.ఈ వాంగ్మూలం కచ్చితంగా వివేకా హంతకుల్ని పట్టిస్తుందని, పెను సంచలనాలకు కారణమవుతుందని భావిస్తున్నారు.

తుది దశకు వివేకా హత్య కేసు
పులివెందులలో తన సొంతింట్లో సన్నిహితుల చేతుల్లో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుల్ని గుర్తించిన సీబీఐ వారిని నిందితులుగా, దోషులుగా నిరూపించేందుకు తగిన ఆధారాల వేటలో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ కేసులో కీలక మలుపులకు కారణమైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని చట్టబద్ధమైన అప్రూవర్ గా మార్చిన సీబీఐ.. ఇప్పుడు ఆయనతో రెండోసారి కీలక వాంగ్మూలం నమోదు చేయించింది. పులివెందుల కోర్టులో నమోదైన ఈ వాంగ్మూలం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

హంతకులెవరో చెప్పేసిన దస్తగిరి?
పులివెందుల కోర్టులో తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో అప్రూవర్ దస్తగిరి ఈ హత్యకు పాల్పడిన హంతకుల వివరాలను చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దస్తగిరి ఇచ్చిన వివరాలతో ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు అనుమానితులను గుర్తించడంతో పాటు వారి పాత్రపై ఓ అంచనాకు వచ్చేసిన సీబీఐకి.. ఈసారి దస్తగిరి వాంగ్మూలం మరింత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి వాంగ్మూలంలో వివరాలు పూర్తిగా బయటికి రాకపోయినా.. స్దూలంగా వివేకా హంతకుల వివరాలు, హత్య జరిగిన విధానాన్ని దస్తగిరి కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది.

మరిన్ని సంచలనాలు తప్పవా?
దస్తగిరి ఇచ్చిన రెండో వాంగ్మూలంలో ఇచ్చిన వివరాలు కచ్చితంగా ఈ కేసును తేల్చేస్తాయని సీబీఐ సహా అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సీబీఐకి ఉన్న అనుమానాలు కాస్తా ఈ వాంగ్మూలంతో పూర్తిగా నివృత్తి అయ్యాయన తెలుస్తోంది. దీంతో ఈ కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఈ వాంగ్మూలం ఎంతో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వివేకా హత్యకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే వ్యవహారంలో తలెత్తిన వివాదమే కారణమని సీబీఐ అనుమానిస్తోంది. ఈసారి దస్తగిరి ఇచ్చే వాంగ్మూలంతో ఈ అనుమానం కాస్తా నిజమైనా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. అదే జరిగితే అధికార వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

అవినాష్ నిందితుడిగా తేలితే!
వివేకా హత్య కేసులో ఇప్పటికే సీబీఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అనుమానితుడిగా భావిస్తోంది. ఇప్పుడు దస్తగిరి వాంగ్మూలంతో ఆయన ఒకవేళ నిందితుడిగా తేలితే ఏం జరగబోతోందన్నది మరింత ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే సీబీఐ ఛార్జిషీట్ పై వైసీపీ ఆగ్రహంగా ఉంది. సీబీఐ కావాలనే తమ పార్టీ ఎంపీని ఈ కసులో ఇరికించాలని చూస్తోందని, వివేకా, అవినాష్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వెల్లడించారు.
ఇప్పుడు సీబీఐకి దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఊహించని అంశాలు చోటు చేసుకుంటే అప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్న వైసీపీ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందన్న దానిపై భవిష్యత్తులో వీరిద్దరి సంబంధాలు ఆధారపడనున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications