APPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా- ఏపీపీఎస్సీ నిర్ణయం..తాజా షెడ్యూల్ ఇదే..
విజయవాడ : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రకటనకూ, పరీక్షల నిర్వహణకూ మధ్య గడువు తక్కువగా ఉండటంతో విమర్శలు వచ్చాయి. ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 నుంచి 9 వరకూ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. దీంతో నోటిఫికేషన్ తర్వాత కేవలం 85 రోజుల గడువు ఇస్తూ ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే అభ్యర్ధుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని జూన్ మొదటి వారానికి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకూ సివిల్స్ పరీక్షల ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 3 నుంచి 9 వరకూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఏపీపీఎస్సీ తాజా నిర్ణయంతో పరీక్షార్ధులకు ఆ మేరకు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లభించనుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం 85 రోజుల గడువు మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో గడువు పెంచాలని ఏపీపీఎస్సీకి అభ్యర్ధుల నుంచి పలు విజ్ఞాపనలు అందాయి. అదే సమయంలో నిన్న యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల షెడ్యూల్ ప్రకటించింది. దీనికి ఏపీ నుంచి 25 మంది విద్యార్ధులు హాజరుకావాల్సి ఉంది. వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మార్పులు చేసింది.













Click it and Unblock the Notifications