APPSCలో ఆధిపత్యపోరు-డబుల్ మూల్యాంకనం-హైకోర్టులో అభ్యర్ధుల సంచలన ఆరోపణలు

వివాదాలకు కేంద్రంగా మారిన ఏపీపీఎస్సీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. 2018 లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ అభ్యర్ధులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. అదే సమయంలో ఏపీపీఎస్సీ విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేసే పలు అంశాలు బయటికి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కచ్చితంగా సంచలనం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష 2018

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష 2018

2018లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం డిజిటల్ విధానంలో చేసే విషయంలో అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో 2021 డిసెంబర్ లో హైకోర్టు ఆదేశాల మేరకు చేత్తోనే చేశారు. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫలితాల విడుదలకు సిద్ధమైన ఏపీపీఎస్సీ చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. దీంతో ఫలితాల విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత మరోసారి మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేసినట్లు అభ్యర్ధులు ఆరోపిస్తుండగా.. ఏపీపీఎస్సీ మాత్రం అదేమీ లేదంటోంది. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ ఆసక్తికరంగా మారింది.

గతేడాది హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం

గతేడాది హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం

ఏపీపీఎస్సీ ఈ పరీక్షా పత్రాల్ని గతేడాది డిసెంబర్ లో గుంటూరు-విజయవాడ మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం చేయించింది. మ్యాన్యువల్ గానే ఈ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం జరిగింది. రూ.2.5 కోట్ల రూపాయల ఖర్చుతో జరిపించిన ఈ మూల్యాంకనానికి హాజరైన సిబ్బందికి క్యామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్ధ ఆహార సదుపాయాలు సమకూర్చింది. అనంతరం మార్కుల పత్రాల్ని స్కాన్ చేసే బాధ్యతను ఢిల్లీకి చెందిన డేటాటెక్ మెథడిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్ధకు అప్పగించారు. ఈ మొత్తం ప్రక్రియ జరిగిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని అభ్యర్ధులు హైకోర్టుకు తెలిపారు.

ఏపీపీఎస్సీలో విభేధాలు ?

ఏపీపీఎస్సీలో విభేధాలు ?

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ను ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హాయ్ ల్యాండ్ లో దిద్దిన ప్రశ్నాపత్రాల ఫలితాల జాబితాపై ఏపీపీఎస్సీలో పలువురు సభ్యులు, ఛైర్మన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమవారి పేర్లు లేకపోవడంపై అభ్యంతరం చెప్పారు. వీరితో కార్యదర్శి విభేధించారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అహ్మద్ బాబును ప్రభుత్వం నియమించింది. ఆయన వచ్చాక గతంలో చేసిన మూల్యాంకనాన్ని పక్కనబెట్టారు. కొత్తగా మరోసారి మూల్యాంకనానికి సిద్ధమయ్యారు.

అభ్యర్ధుల సంచలన ఆరోపణలు

అభ్యర్ధుల సంచలన ఆరోపణలు

హైకోర్టులో జరిగిన విచారణలో గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్ధులు పలు సంచలన విషయాలు ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు పరీక్షల్లో 42 శాతం మంది తెలుగు మీడియం అభ్యర్ధులు ఇంటర్వూలకు అర్హత సాధించినట్లు చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇంగ్లీష్ మీడియం లెక్చరర్లు తెలుగు మీడియం అభ్యర్ధుల పేపర్లు దిద్దడంతో ఈ ఫలితాలు తారుమారయ్యాయని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్ధి రాసిన ఓ పేపర్ లో రెండు చేతిరాతలు ఉన్నాయనే విషయం బయటపడిందన్నారు. ఆ తర్వాత పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ఏపీపీఎస్సీ అంగీకరించిందన్నారు. అలాగే మ్యాన్యువల్ మూల్యాంకనంపై హైకోర్టు సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పును ఏపీపీఎస్సీ సభ్యులు తమకు అనుకూలంగా మల్చుకుని తమకు కావాల్సిన వారికి మేలుచేశారని కూడా ఆరోపించారు.

 ఏపీపీఎస్సీ వాదన ఇదే..

ఏపీపీఎస్సీ వాదన ఇదే..

కానీ ఏపీపీఎస్సీ మాత్రం ప్రశ్నాపత్రాల్ని డిజిటల్ మూల్యాంకనం చేయించడాన్ని, మ్యాన్యువల్ గా మూల్యాంకనం చేయించడాన్ని పోల్చకూడదంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. డిజిటల్ మూల్యాంకనం ద్వారా 325 మంది అభ్యర్ధుల్ని అర్హులుగా తేల్చామని, కానీ హైకోర్టు సింగిల్ జడ్డి వాదన తర్వాత ఆ 325 మందిలో 202 మంది అర్హత సాధించలేదని తెలిపింది. ఇందులో 20 శాతం మంది హైకోర్టును ఆశ్రయించిట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అలాగే హాయ్ ల్యాండ్ లో రూ.2.5 కోట్లు ఖర్చుచేసి మ్యాన్యువల్ మూల్యాంకనం చేసినట్లు అభ్యర్ధులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని ఏపీపీఎస్సీ వాదిస్తోంది. రూల్స్ ప్రకారం చూసినా అభ్యర్ధుల ప్రశ్నాపత్రాల్ని ఇద్దరు ఎగ్జామినర్లు ప్రశ్నిస్తారని, 15 శాతం అంతకంటే ఎక్కువ తేడా వస్తే మూడో ఎగ్జామినర్ కు పంపుతారని గుర్తుచేసింది. దీంతో పిటిషనర్ల వాదనను కొట్టేయాలని హైకోర్టును కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+