మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా హెచ్చరిక...!!

వర్షాల పై బిగ్ అప్డేట్. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ వర్షాల పైన కీలక సమాచారం అందుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు వర్షాల పై విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం అందిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

 తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!
తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!
apsdma-alerts-over-rain-chances-in-many-parts-of-the-state-as-low-depression-in-bay-of-bengal

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

కాగా, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతోపాటు.. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదే విధంగా తెలంగాణలో ని పలు జిల్లాలకు వర్షాల పైన అప్డేట్ వచ్చింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులతోపాటు.. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత వారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లోనూ కుండ పోత వర్షం కురిసింది. ఇక, ఇప్పుడు తిరిగి తాజా హెచ్చరికలతో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+