AP Weather: రేపు ఏపీలో అటు వడగాల్పులు-ఇటు పిడుగులతో వర్షాలు..!
వేసవి ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ విభాగం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పలు చోట్ల రేపు పిడుగులతో కూడిన వర్షాలు (weather) పడతాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
సోమవారం(20-04-26) పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు,సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలున్నాయి.

అలాగే శ్రీకాకుళంలో ఒకటి, విజయనగరం లో 7, మన్యం లో ఒకటి, పోలవరంలో నాలుగు, అనకాపల్లి లో ఒకటి, తూర్పుగోదావరిలో 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచిస్తోంది. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు,పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications