Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై రచ్చ-గరికపాటి వర్సెస్ కమలానంద..!

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కేరళ పేరును ఆ రాష్ట్ర వాసుల కోరిక మేరకు కేరళంగా మార్చడంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పేరును కూడా మార్చాలనే డిమాండ్లు మొదలయ్యాయి. గతంలో ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ గా ఉన్న పేరును తెలుగునాడుగా మార్చేందుకు గతంలో జరిగిన ప్రయత్నాలు కూడా ఆటోమేటిగ్గా తెరపైకి వస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ పేరును మార్చకూడదంటూ మరో వర్గం దీనికి కౌంటర్ అటాక్ ప్రారంభించింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ను పేరును 'తెలుగునాడు'గా మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. 'తెలుగునాడు'గా మార్చేందుకు ఆనాడు ఎన్టీఆర్ ప్రయత్నించారన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని, ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదని ఆయన తేల్చేశారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదని, కేరళను 'కేరళం'గా మార్చినట్లే ఆంధ్రప్రదేశ్ పేరును 'తెలుగునాడు'గా మార్చాలని గరికపాటి కోరారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు చర్చ మొదలైంది.

Andhra Pradesh Name Change Row The Bitter Feud Between Garikati and Kamalananda Bharati

దీనిపై భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందంటూ ఆయన గరికపాటికి గుర్తుచేశారు. అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వింత పోకడలు, వింత ఆలోచనలు మంచిది కాదన్నారు. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదని, ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారని విమర్శలు గుప్పించారు. గరికపాటి తెలంగాణలో సెటిలయ్యారని, ఆంధ్రాకు రారని కూడా తెలిపారు. మా ప్రాంతం, మా బ్రతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసంటూ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+