Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిడుగులతో భారీ వర్షాలు, ఈదురుగాలులు - తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్..!!

ఏపీ విపత్తుల శాఖ తాజాగా కీలక హెచ్చరిక చేసింది. మారిన వాతావరణ పరిస్థితుల్లో పలు జిల్లాల్లో రానున్న కొద్ది గంటల్లో ఈదురు గాలులతో పాటుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తొమ్మది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50-60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. మరికొన్ని చోట్ల ఎండల ప్రభావంతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రానున్న కొద్ది గంటల్లో భారీగా ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. పిడుగుల తో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
apsdma-red-alert-over-heavy-rains-for-nine-districts-in-the-state-in-next-few-hours-issues-key-dire

ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఒకవైపు వర్షాలు, పిడుగుపాటులు ఉండగా.. మరోవైపు వడగాలుల హెచ్చరికలను కూడా ఏపీఎస్‌డీఎంఏ జారీ చేసింది. పోలవరం జిల్లాలోని చింతూరు, ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి, తిరుమల, ఏలూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+