ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పు, తాజా మార్గదర్శకాలు..!!
APSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం నిర్వహణ పైన ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ.. అవసరమైన మార్పులు సూచిస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఈ పథకం వినియోగించుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉచిత బస్సు పథకం విస్తరణలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది మహిళా ప్రయాణీకులకు వెసులుబాటు గా మారనుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తోంది. ఈ పథకం పైన నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. పథకం నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు సూచిస్తోంది. పథకం అమల్లో భాగంగా బస్సుల నిర్వహణ.. సులభంగా మహిళా ప్రయాణీకులకు సమాచారం అందే విధంగా మార్పులు తీసుకొస్తోంది. ఇందు కోసం క్రమేణా పథకం విస్తరిస్తోంది. ప్రస్తుతం అయిదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. తొలుత ఘాట్ రోడ్లలో కొనసాగే సర్వీసుల్లో అనుమతించలేదు. ఆ తరువాత ప్రభుత్వం ఆదేశాలతో తిరుమలతో సహా ఇతర ఘాట్ రోడ్ సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఇక.. తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎం-ఈబస్ సేవ పథకం కింద కేంద్రం రాష్ట్రంలోని 11 నగరాల్లో ఏపీఎస్ఆర్టీసీకి 750 విద్యుత్ బస్సులను కేటాయించింది. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారులు విజయవాడకు 100 బస్సులు కేటాయించారు. త్వరలోనే ఈ బస్సులు రోడ్డు పైకి రానున్నాయి. వీటిల్లోనూ స్త్రీశక్తి పథకం అమలుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల కేటాయింపు.. స్త్రీ శక్తి పథకం అమలు
ఈ బస్సుల నిర్వహణ కోసం మొత్తం 250 మంది డ్రైవర్లను నిర్వహణ సంస్థ సమకూరుస్తుండగా 250 మంది కండక్టర్లను సైతం ఆర్టీసీ సర్దుబాటు చేస్తుంది. ఒక్కో బస్సులోనూ 40 సీట్లు ఉడేలా డిజైన్ చేసారు. వీటిల్లోనూ ఇక నుంచి ఉచిత బస్సు ప్రయాణం సైతం వర్తించనుంది. మొత్తంగా 100 ఎలక్ట్రిక్ బస్సులను 11 మార్గాల్లో నడపనున్నారు. విద్యుత్ బస్సుల కోసం ఏపీలో 11 డిపోలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగానూ సివిల్, విద్యుత్ పనులకు కేంద్రం నిధులు సమకూర్చనుంది. ఇప్పటికే విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖకు 100 బస్సుల చొప్పున కేటాయించారు. అదే విధంగా కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి, కడప, మంగళం (తిరుపతి), అనంతపురం, కర్నూలుకు 50 బస్సులు చొప్పున కేటాయించారు. దీంతో.. ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం అయిన వెంటనే.. వాటిల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు. ఇది మహిళలకు మరింత ప్రయోజనకరంగా మారనుంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications