ఉచిత బస్సు నడపాలంటే..! ఆర్టీసీ యూనియన్ తాజా డిమాండ్స్..!
ఎన్నికల హామీ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే పథకాన్ని కొన్ని నెలలుగా అమలు చేస్తున్నాయి. అయితే ఈ పథకం అమలు చేస్తున్నారే కానీ ఇందుకు అవసరమైన బస్సులు అందుబాటులో ఉంచడం, సకాలంలో రిపేర్లు చేయించడం, డ్రైవర్ల ఇబ్బందుల్ని పరిష్కరించడం వంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో ఉచిత బస్సు పథకం నడపాలంటే తమ ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ (పీటీడీ) ఎంప్లాయీస్ యూనియన్ కొన్ని డిమాండ్లను కూటమి సర్కార్ ముందు పెట్టింది. స్త్రీ-శక్తి పధకం వల్ల కండక్టర్లు, డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆర్టీసి ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు కోరారు. పెండింగ్ స్త్రీ-శక్తి డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. తనిఖీ అధికారులు కేసులు రాస్తూ కండక్టర్లను సస్పెండ్ చేసే విధానం మానుకోవాలన్నారు.

స్త్రీ-శక్తి పధకం డబ్బులు చెల్లించక పోతే డీజిల్ కొనలేక బస్సులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఈయూ నేత హెచ్చరిచారు.
ఈ నెల 5న జరిగే ఆర్టీసీ బోర్డు సమావేశంలో తమ సమస్యలు చర్చించాలని కోరారు. స్త్రీ-శక్తి స్కీమ్ విజయవంతానికి 3000 బస్సులు, 10,000 సిబ్బంది అవసరమని తెలిపారు. పెండింగ్ ఓటి, అలవెన్సులు, నైట్ హాల్టు అలవెన్సు డబ్బులు వెంటనే చెల్లించాలని ఈయూ నేత కోరారు.

అలాగే ఆర్టీసీలో కారుణ్య నియామకాలు, మెడికల్ ఫెయిల్డ్ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రతకు సర్క్యులర్ 01/2019ని అమలు చేయాలన్నారు. ఆర్టీసి గుర్తింపు సంఘాలకు ఆఫీసులు, రాయితీలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ మేరకు ఈయూ నేతలు ఆర్టీసి చైర్మన్ కు, వీసీ-ఎండీకి లేఖలు సమర్పించారు. అయితే రేపు జరిగే ఆర్టీసీ బోర్డు భేటీలో ఈ డిమాండ్లపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications