వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఉధృతితో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం .. బస్సులు ఎక్కాలంటే ఆ రూల్స్ పాటించాల్సిందే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరోమారు పెరుగుతున్న తీరు రాష్ట్రంలో ఆందోళనకరంగా మారింది. పెరుగుతున్న కరోనా కేసులతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలో కరోనా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి అందరూ పాటించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది . ఇదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంట్లో భజన చేశారు .. తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా భజాయించిందిఇంట్లో భజన చేశారు .. తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా భజాయించింది

 బస్సు ఎక్కాలంటే మాస్కు మస్ట్ .. కరోనా రూల్స్ పాటించాలని ఆదేశం

బస్సు ఎక్కాలంటే మాస్కు మస్ట్ .. కరోనా రూల్స్ పాటించాలని ఆదేశం

ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తుంది. ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, మాస్కులు ధరించి లేకుంటే బస్సులోకి అనుమతించేది లేదని తేల్చి చెబుతోంది. అలాగే బస్టాండ్లలో, బస్సులో శానిటైజర్ లను ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ లో ఉన్న స్టాల్స్ లో మాస్కుల విక్రయాన్ని చేపడతామని, ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. కండక్టర్లు, డ్రైవర్లు కూడా కరోనా నిబంధనలు పాటించాలని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

 కరోనా నియంత్రణపై మంత్రి ఆళ్ళ నానీ సమీక్ష .. అధికారులకు కీలక సూచనలు

కరోనా నియంత్రణపై మంత్రి ఆళ్ళ నానీ సమీక్ష .. అధికారులకు కీలక సూచనలు

ఇక తాజాగా కరోనా నియంత్రణపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు . విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల డిఎంహెచ్ఓ లతో మాట్లాడారు. కేసులు ఎక్కువగా పెరుగుతున్న జిల్లాలలో కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు .ఇదే సమయంలో జిల్లాలకు సర్వే టీమ్ లను పంపాలని పేర్కొన్నారు.మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్నందున బోర్డర్లో ఉన్న చిత్తూరు జిల్లాలో కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆళ్ల నాని స్పష్టం చేశారు.

మాస్కులు లేకుండా రోడ్ల మీదకు వస్తే కష్టమే .. బస్సుల్లో సైతం కరోనా కట్టడికి యత్నం

మాస్కులు లేకుండా రోడ్ల మీదకు వస్తే కష్టమే .. బస్సుల్లో సైతం కరోనా కట్టడికి యత్నం

తిరుపతి రుయా, స్విమ్స్ లో కరోనా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కరోనా నిబంధనను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 500 రూపాయలు , పట్టణాల్లో వెయ్యి రూపాయలు మాస్కులు ధరించాకుంటే వెయ్యాలని ఏపీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు . రోడ్డు మీద మాస్కులు లేకుండా కనిపించే వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు .తాజాగా బస్సుల్లో సైతం కరోనా వ్యాప్తి జరగకుండా కీలక జాగ్రత్తలు పాటించనున్నారు .

English summary
In view of the increase in corona cases, the RTC has made it clear that passengers must strictly abide by the corona rules in order to travel by bus. It states that every passenger must wear masks and not be allowed on the bus if they are not wearing masks. The APSRTC also said that sanitizers would be installed at bus stands and buses, and the sale of masks would be carried out in stalls at the bus stand. APSRTC clarified that conductors and drivers should also abide by the corona rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X