వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అన్ని బస్సులకూ ఆన్ లైన్ టికెట్లు.. ఒకేసారి 50 వేల బుకింగ్స్- రిజర్వేషన్లో భారీ మార్పులు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేరుగా చేతికి టికెట్లు ఇవ్వడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆన్ లైన్ టికెట్ విధానంలో భారీగా మార్పులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై అన్ని బస్సులకూ ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మరకు ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్ధను ఆర్టీసీ ఆధునీకరిస్తోంది.

Recommended Video

తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu

కరోనా వ్యాప్తి భయాలు ప్రయాణికుల్లో ఎక్కువగా ఉన్నందున ఇకపై టికెట్ల కొనుగోళ్లలో నగదు రహిత విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. దీని ప్రకారం ఇకపై అన్ని బస్సుల్లోనూ ముందస్తు రిజర్వేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్దను ఏర్పాటు చేయనుంది. ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేలా ఆన్ లైన్ వైబ్ సైట్లో మార్పులు చేస్తున్నారు.

apsrtc new ticket reservation policy to made every ticket book through online only

దీంతో ఈ నెల 30న ఆర్టీసీ సర్వర్ ను తాత్కాలికంగా నిలిపేయాలని అధికారులు నిర్ణయిఁచారు. ఈ నెల 30న రాత్రి 12 గంటల నుంచి జూలై 1 ఉదయం 5 గంటల వరకూ సర్వర్ పనిచేయదని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఎలాంటి బుకింగ్స్, టికెట్ల రద్దు అందుబాటులో ఉండదు.

English summary
andhra pradesh public transport department has decided to completely revamp its bus ticket reservation system soon. due to covid 19 spread rtc will implement online reservations for every bus ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X