విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు - అర్హతలు..!!

విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తోంది. 10వ తరగతి వరకు చదివే విద్యార్ధుల కు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ప్రస్తుతం విద్య సంవత్సరం తిరిగి ప్రారంభం కావటం తో అధికారులు బస్ పాస్ ల విషయంలో తుది కసరత్తు చేస్తున్నారు. కొత్తవి జారీ చేయంతో పాటు గా రెన్యువల్ కు సంబంధించి స్పష్టత ఇచ్చారు. బస్ పాస్ లు పొందేందుకు అవసమైన మార్గదర్శ కాలను అధికారుల వెల్లడించారు.

పదో తరగతి లోపు చదివే విద్యార్ధులకు బస్ పాస్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. ఇందు కోసం ఈ నెల 14వ తేదీ నుంచి దగ్గరలోని ఆర్టీసీ బస్టాండులలోని బస్‌పాస్‌ కౌంటర్లలో దరఖాస్తు చేసు వాలని అధికారులు సూచించారు. రెన్యువల్‌ చేసుకోవాల్సిన విద్యార్థులు పాత పాస్‌లను బస్‌పాస్‌ కౌంటర్‌లో ఇస్తే కొత్తవి ఇస్తారని వివరించారు. అదే విధంగా ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు ఒక నెల, మూడు నెలలు, అదే విధంగా ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా బస్‌పాస్‌లు అందుబాటు ఉన్నాయని అధికారులు వివరించారు. అదే విధంగా తమ మొబైల్ నుంచే ఆన్‌లైన్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ ఆన్‌లైన్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

apsrtc-providing-free-bus-passes-for-students-details-here

కాగా, ఏ డిపో పరిధిలోని విద్యార్థులు ఆ డిపోల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధి రులు సూచించారు. బస్ పాస్ ల కోసం విద్యార్ధులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్‌తో ఉన్న ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ అప్లికేషన్ ఫారం నింపాలని సూచించారు. దరఖాస్తు దారుడు ఆధార్‌ కార్డు జిరాక్స్ తో పాటు ఒక ఫొటో ఉండాలని సూచించారు. 12 ఏళ్లలోపు ఉన్న బాలురకు, అదే విధంగా 18 ఏళ్లలోపు ఉండి 10వ తరగతి చదివే బాలికలకు ఆర్టీసీ స్టూడెంట్ బస్ పాస్‌లను ఉచితంగా అందిస్తోంది. వీరు 20 కిలో మీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల కు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్ .. ఆపై చదివే బాలికలకు రాయితీ ధరలకు బస్ పాస్ లు జారీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+