APSRTC గుడ్ న్యూస్: ఇవాళ్టి నుంచి దూరప్రాంత సర్వీసులు పునఃప్రారంభం
ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో క్రమంగా బస్సు సర్వీసుల్ని పెంచుతున్న ఆర్టీసీ.. ఇప్పుడు దూర ప్రాంత సర్వీసుల్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖతో పాటు తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్ని ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభించింది.
Recommended Video
ఏపీలో కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా భయాలతో ప్రయాణికులు బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆర్టీసీ కూడా వాటిని తగ్గిస్తూ వచ్చింది. ప్రయాణికుల రద్దీ లేని చోట పలు బస్సు సర్వీసుల్ని రద్దు చేసింది. చివరికి ఆర్టీసీ దూర ప్రాంతాల బస్సుల్ని కోవిడ్ సేవలకు కూడా కేటాయించింది. ఇప్పుడు తిరిగి పరిస్ధితులు క్రమంగా చక్కబడుతుండటంతో అధికారులు తమ నిర్ణయాల్ని సమీక్షిస్తున్నారు.

ఏపీలో నిన్నటి వరకూ పగటి పూట కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటల నుంచే అమలవుతుండటంతో దూర ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో ఆర్టీసీ ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడింది. ఇవాళ్టి నుంచి ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్ని మధ్యాహ్నం 2 గంటల వరకూ పెంచడంతో ఆర్టీసీ బస్సుల్ని కూడా దూర ప్రాంతాలకు పంపేందుకు వీలు కలిగింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అంటే 8 గంటల పాటు బస్సుల్ని తిప్పేందుకు వీలు కలిగింది. దీంతో ఆర్టీసీ ఇవాళ్టి నుంచి దశల వారీగా దూరప్రాంత సర్వీసుల్ని పునఃప్రారంభిస్తోంది. ఆన్‌లైన్‌లో ఈ బస్సుల రిజర్వేషన్ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.












Click it and Unblock the Notifications