తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అరుదైన రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపైన కొలువైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవదేవుడు అయిన శ్రీవారిని దర్శించుకుని తరించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగాను, ఇతర దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని వసతులు కల్పించి బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహించింది టీటీడీ.

గరుడ వాహన సేవ అద్భుతంగా నిర్వహించారని టీటీడీని ప్రశంసించిన చంద్రబాబు
తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ నిర్వహించిన తీరును ఏపీ సీఎం చంద్రబాబు సైతం కొనియాడారు. పరమ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 3 లక్షల మందికిపైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి మంచి అనుభూతిని మిగిల్చారని ఆయన పేర్కొన్నారు.

APSRTC sets record in Garuda Seva during Srivari Brahmotsavam What did CM Chandrababu say

తిరుమలకు వచ్చిన భక్తకోటికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
టీటీడీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు, బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ బోర్డుకు, దేవస్థానం అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఆ శాఖ సిబ్బందికి అభినందనలు. తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

తిరుమల శ్రీవారి గరుడ సేవలో 24 గంటల్లోనే రికార్డ్
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు సాధించింది. రికార్డు స్థాయిలో భక్తులను క్షేమంగా తిరుమలకు చేరవేసింది. ఇక ఇదే విషయాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. 24 గంటల్లోనే 5,642 ట్రిప్స్ - 2,16,753 మంది భక్తులకు రవాణా సదుపాయం కల్పించినట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.రికార్డు స్థాయి రవాణా సేవలతో పాటు జీరో బ్రేక్‌డౌన్ తో నిరవధిక సేవలు అందించడం ప్రశంసనీయం అని ఆయన అన్నారు.

జీరో బ్రేక్ డౌన్ తో నిరవధిక సేవలు చేయటంపై మంత్రి ప్రశంసలు
గత సంవత్సరం కంటే ఈసారి భక్తుల సంఖ్య ముఖ్యంగా రవాణాలో భారీ పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. గత రికార్డులను అధిగమించిన 2025 గరుడ సేవకు రవాణా వ్యవస్థ చాలా కమిట్మెంట్ తో పని చేసిందని కొనియాడారు. జీరో బ్రేక్‌డౌన్ తో నిరవధిక సేవలు అందించడం ప్రశంసనీయం అన్నారు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి.

ఘాట్ రోడ్ ఆపరేషన్స్‌లో విశేష కృషి వల్లే ఈ ఘనత
అధికారులు, సిబ్బంది, సంఘాల సమన్వయంతో ఘాట్ రోడ్ ఆపరేషన్స్‌లో విశేష కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వారందరినీ అభినందించారు.మెకానికల్ సిబ్బంది కృషి వల్ల జీరో బ్రేక్‌డౌన్ తోడ్పాటుతో భక్తుల సేవలో ఆర్టీసీ సక్సెస్ అయ్యిందన్నారు. భక్తుల సేవకు నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్న ఏపీఎస్ఆర్టీసీని మంత్రి మండిపల్లి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందు ముందు ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+