APSRTC : ఆర్టీసీ మరో గుడ్ న్యూస్- ఇక స్కూలు పిల్లలు మరింత సేఫ్..

ఏపీలో కొంతకాలంగా విప్లవాత్మక మార్పులు చేస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణాసంస్ధ ఏపీఎస్ ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాల విద్యార్ధుల కోసం నడుపుతున్న బస్సుల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న విద్యార్ధులు మరింత భద్రంగా పాఠశాలలకు రాకపోకలు సాగించేందుకు వీలు కలగనుంది.

ఏపీలో ఆర్టీసీ తన సొంత బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల్ని లీజుకు తీసుకుని కూడా నడుపుతోంది. అలాగే సొంత బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా పాఠశాల విద్యార్ధుల్ని తరలించేందుకు వాడుతోంది. ఇలా మొత్తం 413 బస్సులు రాష్ట్రంలో రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే వీటిలో దాదాపు 300 బస్సుల వరకూ ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించిన డ్రైవర్లే నడుపుతున్నారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న వనరుల కొరత కారణంగా ఈ సమస్య తప్పడం లేదు. అయితే వీటిపై ఆర్టీసీ పునస్సమీక్ష చేసింది.

 apsrtcschoolkids

రాష్ట్రంలో విద్యార్ధుల కోసం నడుపుతున్న బస్సులకు మొత్తం సొంత డ్రైవర్లనే వినియోగించాలని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో విద్యార్ధుల కోసం నడుస్తున్న 413 బస్సుల్లోనూ ఆర్టీసీ డ్రైవర్లే దర్శనమివ్వబోతున్నారు. ఆ మేరకు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లను పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ సర్వీసులకు కేటాయిస్తారు. ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు సకాలంలో విధులకు హాజరుకాకపోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతుండటంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన డ్రైవర్లకు దూర ప్రాంత సర్వీసుల్లోనూ, ఏసీ సర్వీసులు, ఘాట్ సర్వీసుల్లోనూ విధులు కేటాయించవద్దని మరో ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరిని బడి బస్సులకు కేటాయిస్తే బావుంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా సీనియర్లు కావడంతో ఆ మేరకు విధుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆర్టీసీ భావిస్తోంది. వీరి వయసును, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్నాళ్లు కీలక సర్వీసుల్లో వాడుతుండగా.. ఇప్పుడు వీరిని బడి బస్సులకు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+