ఎంపీ గీత భవితవ్యం ప్రశ్నార్థకమేనా?: కుల వివాదంలో సొదరుడు

అమరావతి: కుల ధ్రువీకరణలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత సోదరుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఎంపీ సొదరుడు వివేకానంద కుమార్ ఎస్టీ కాదని విశాఖపట్నం జిల్లా విచారణ కమిటీ తేల్చింది. దీంతో గతంలో కొత్తపల్లి గీత గిరిజన కులానికి చెందిన వ్యక్తి కాదని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజా పరిణామాలతో కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిందిగా విచారణ కమిటీ కోరింది. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా విచారణకు హాజరు కాలేనని ఆమె తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వివేకానంద తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో ఓ బీమా కంపెనీలో ఉద్యోగం సంపాదించారని, ఆతని ఎస్టీ సర్టిఫికెట్‌పై విచారణ జరపాలని గిరిజన సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపారు. విచారణలో వివేకానంద ఎస్టీ కాదని తూర్పుగోదావరి జిల్లా అధికారులు తేల్చారు.

Araku mp kothapalli geetha brother in trouble.

ఈ మేరకు అతడికి నోటీసులు కూడా పంపారు. గతంలో కొత్తపల్లి గీత గిరిజన కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆమె ఎన్నికను రద్దు చేయాలని అప్పట్లో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆరోపించింది. అరకు ఎంపీగా ఎన్నికైన కొత్లపల్లి గీత ఆది ఆంధ్రా మాల కులానికి చెందిన వ్యక్తి.

కాగా, ఆమె క్రిస్టియన్‌గా మతం మార్చుకోవడంతో 1993లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఆమె కులధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ, గీత గిరిజనురాలు కాదని, క్రిస్టియన్ బీసీ 'బి' కేటగిరీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గీత సోదరుడు ఎస్టీ కాదని డీఎల్‌ఎస్‌సీ నివేదిక ఇవ్వడంతో ఎంపీ గీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+