బాబూ! లెక్క చెప్పు, జగన్‌తో వస్తుందా: డ్రామాలొద్దని కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Kothapalli Geetha Takes U Turn In Parliament

  న్యూఢిల్లీ: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభ వాయిదా పడిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎంపీలు పదేపదే నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో స్పీకర్ సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు

  ఆ తర్వాత కొత్తపల్లి గీత మాట్లాడారు. పార్లమెంటులో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు అంతా ఓ డ్రామా అని మండిపడ్డారు. ఈ డ్రామాలు వద్దని అభిప్రాయపడ్డారు. అందులో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. గీత గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీకి దగ్గరై.. ఇప్పుడు ఇరు పార్టీలకు సమానదూరం పాటిస్తున్నారు. ఆమె జనసేన వైపు చూస్తున్నారని కూడా గతంలో ప్రచారం జరిగింది.

  ఏపీకి హామీపై గడ్కరీ, వెంకయ్యపై నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి

  చంద్రబాబు, జగన్‌లకు షాక్

  చంద్రబాబు, జగన్‌లకు షాక్

  ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు, వైసీపీ అధినేత జగన్‌కు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యలపై టీడీపీ, వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. అసలు వైసీపీ వైఖరి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని చెప్పారు.

  హోదా కంటే ప్యాకేజీయే మంచిది

  హోదా కంటే ప్యాకేజీయే మంచిది

  ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మంచిది అని అప్పట్లో సన్మానాలు చేయించుకున్నారని టీడీపీని ఉద్దేశించి కొత్తపల్లి గీత దుయ్యబట్టారు. రెండంకెల వృద్ధి రేటు అని చెప్పుకునే వాళ్లు ప్రత్యేక హోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

  టీడీపీతో కలిసి ఉంటే రాలేదు, వైసీపీతో వస్తుందా

  టీడీపీతో కలిసి ఉంటే రాలేదు, వైసీపీతో వస్తుందా

  టీడీపీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిస్తే బీజేపీ ఇస్తుందా అని ఆమె నిలదీశారు. వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ ప్రత్యేక హోదా విషయంలో పదేపదే టీడీపీని టార్గేట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

  టీడీపీ లెక్కలు ఎందుకు చెప్పట్లేదు

  టీడీపీ లెక్కలు ఎందుకు చెప్పట్లేదు


  కేంద్రం ఇచ్చిన నిధులకు అధికార టీడీపీ లెక్కలు ఎందుకు చెప్పడం లేదని కొత్తపల్లి గీత ప్రశ్నించారు. కేంద్రం నిధులను ఏం చేస్తున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. పోలవరంపై ఖర్చులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని అడిగారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Araku MP Kothapalli Geetha lashed out at YSR Congress chief YS Jagan Mohan Reddy and Chief Minister Nara Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి