ఏపీలో 80రూపాయలకే క్వార్టర్ మద్యం.. తాగుతున్నారా? అలెర్ట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తక్కువ రేట్ కి క్వాలిటీ మద్యాన్ని అందించాలని ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాంగులు ఇంకా తక్కువ ధరకు మద్యం అందించాలని నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టింది అయితే దీనిపైన నిఘా పెట్టిన అధికారులు అసలు విషయాన్ని తెలుసుకుమో అవాక్కయ్యారు.

నకిలీ మద్యం తయారీ గ్యాంగ్
నకిలీ మద్యం తయారు చేసిన ముఠా బెల్ట్ షాపుల్లో కేవలం 80 రూపాయలకే దానిని విక్రయిస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపారు. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లాలోని ఒక బెల్టు షాపులో అధికారులకు నకిలీ మద్యం దొరికింది. ప్రస్తుతం ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.100 లభిస్తుండగా అన్నమయ్య జిల్లా అనంతరాజుపేటలో బెల్ట్ షాప్ లో 80 రూపాయలకే చీప్ లిక్కర్ దొరుకుతుంది.

Are you drinking a quarter of liquor for just Rs 80 in AP alert

మద్యం మాఫియా గుట్టు రట్టు
అయితే దీనిని గురించి తెలిసిన ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం మాఫియా గుట్టు రట్టు చేసి నిందితులను అరెస్టు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. స్పిరిట్ క్యారమిల్ తో తయారు చేసిన నకిలీ మద్యం బాటిల్స్ ను గుర్తించిన అధికారులు, అన్నమయ్య జిల్లా పించాకు చెందిన వెంకటరమణ బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కరోనా సమయంలో తిరిగి వచ్చాడని తన బంధువైన జవాబుతో కలిసి తిరుపతి కేంద్రంగా మద్యం తయారీకి ప్లాన్ చేశాడని గుర్తించారు.

బెల్ట్ షాపుల్లో విక్రయాలు చేస్తున్న నకిలీ మద్యం తయారీ గ్యాంగులు
ఇక పాత మద్యం బాటిల్స్ లో వారు తయారు చేసిన నకిలీ మద్యాన్ని నింపి స్టిక్కర్లు అతికించి బెల్ట్ షాపులలో విక్రయిస్తున్నారని గుర్తించారు. తరచూ ఇళ్ళు మారుస్తూ ఆర్డర్ ల మేరకు నకిలీ మద్యం తయారు చేసే వారిని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇటీవల ఎక్సైజ్ అధికారులు చేసిన సోదాలలో వీరు వద్ద నుండి 805 లీటర్ల స్పిరిట్ ను, ఖాళీ సీసాలను, నకిలీ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మద్యం తాగితే ప్రాణాలకే ప్రమాదం
ఇక ఈ దందా సాగిస్తున్న వెంకటరమణ వద్ద నుండి 283 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వీరి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్ మరియు క్యారమిల్ తో తయారుచేసిన ఈ నకిలీ మద్యం తాగితే ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టుకున్నట్టేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+