Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ పై తెలంగాణా హైకోర్టులో వాదనలు.. సీబీఐ ఏం చెప్పిందంటే

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఇక కేసులో నేడు విచారణ కొనసాగింది. సీబీఐ తరపున న్యాయవాది తమ పక్షాన కౌంటర్ దాఖలు చెయ్యటానికి మరికొంత సమయం కావాలని కోర్టును కోరారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . ఇక ఈ నేపధ్యంలో తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల ను నిర్వహించే నిమిత్తం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ కోర్టు నిరాకరించటంతో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించారు జగన్ .

Arguments On Personal Appeal Petition of Jagan in Telangana High Court .. What the CBI said

సీబీఐ కోర్టు ఇప్పటికి రెండు సార్లు వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసి జగన్ హాజరు కావాలని తేల్చి చెప్పింది.ఇక దీంతో ఆయన ఈసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ ను ఫిబ్రవరి ఆరు కు వాయిదా వేయగా నేడు విచారణ కొనసాగింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు మరింత గడువును కోరారు. దీంతో జగన్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+