చంద్రబాబు, పెద్దిరెడ్డి, రోజా జాతకాలు ఉన్నా ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్, ఆపక్క కనపడితే అంతే !
ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజక వర్గాలు, లోక్ సభ నియోజక వర్గాలకు పోలింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాలకు భారీగా పోలింగ్ జరగడంతో నాయకులు తలరాతలు ఇప్పటికే ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి. అలాంటి ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లకు పోలీసులు, సాయుధ బలగాలు భారీ భద్రత కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు, చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం పరిదిలో పోలింగ్ కోసం ఉపయోగించిన ఈవీఎంలను చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు సాదిక్ ఆలం, కైలాష్ వాంగ్డే, చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆ స్ట్రాంగ్ రూమ్ లో తాళం వేసి వాటికి సీల్ వేశారు.

చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ లో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ప్రాంతంలో సాయుధ బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. చిత్తూరు, కుప్పం, నగిరి, పలమనేరు, పుంగనూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజక వర్గాల పరిదిలో పోలింగ్ కు ఉపయోగించిన ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. అలాగే చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం పరిదిలో ఉపయోగించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు.
ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు, చిత్తూరు లోక్ సభ నియోజక వర్గానికి చెందిన ఈవీఎంలు ఇక్కడ భద్రపరిచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు పోటీ చేసిన కుప్పం, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చేసిన నియోజక వర్గం పుంగనూరు, ఆర్ కే రోజా పోటీ చేసిన నరిగి అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉపయోగించిన ఈవీఎంలు ఇదే చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రంగా ఉన్నాయి.
తిరుపతిలో పద్మావతి యూనివర్శిటిలో స్ట్రాంగ్ రూమ్ లు ఉన్న ప్రాంతానికి వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి సంఘటనను గుర్తు పెట్టుకున్న పోలీసులు చిత్తూరులో అలర్ట్ అయ్యారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరూ రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని, ఆ ప్రాంతాలకు ఎవ్వరూ రాకుడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. అయితే ఎన్నికలలో పోటీ చేసిన నాయకులు మాత్రం స్ట్రాంగ్ రూమ్ ల దగ్గరకు వెళ్లి బయట నుంచి పరిశీలించడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications