దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు అనుమానితుడు అరెస్ట్‌... విచారణ

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు కేసులో అనుమానితుడిగా భావిస్తున్న నిందితుడి సయ్యద్‌ ఇస్మాయిల్‌ అఫక్‌ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం అతడిని బెంగుళూరు పోలీసులు భత్కల్‌లో అరెస్టు చేశారు.

ఇటీవల బెంగళూరులోని చర్చి స్ట్రీట్ బాంబు పేలుళ్ల ఘటనలో కూడా అనుమానితుడిగా భావిస్తున్న అఫక్‌ను పోలీసులు విచారించగా దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా పలు పేలుళ్లతో అతనికి సంబంధం ఉన్నట్లు వెల్లడించాడు.

Arrested were involved in Dilsukhnagar blast: Police

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లకు బాంబులను తయారు చేసినట్లు అఫక్‌ అంగీకరించాడు. దీంతోపాటు బెంగళూరు బాంబు పేలుడుకు 4 గంటల ముందు బాంబును తయారు చేసినట్లు అఫక్ ఒప్పుకున్నాడు. మంగళూరులో పేలుడు పదార్థాలు కొన్నానని అఫక్ విచారణలో వెల్లడించాడు.

దీంతో పేలుడు పదార్థాలను అఫక్ మంగళూరులో ఎక్కడ కొనుగోలు చేశాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలతో అఫక్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. గత వారం బెంగుళూరు చర్చి స్ట్రీట్ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ముగ్గురిని కర్నాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+