Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్ సెగ: బాబు ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్, ఏపీకి గోరంత సాయం!

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత లేని నేపథ్యంలో చంద్రబాబు వద్దకు వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల పైన చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు స్వయంగా వెళ్లి ఆయనను పవన్ కళ్యాణ్ లోటుబడ్జెట్ ఉన్న రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరే అవకాశాలు ఉండవచ్చునని, ఈ విషయమై వారు చర్చిస్తుండవచ్చునని అంటున్నారు.

బడ్జెట్‌లో ఏపీకి అసంతృప్తి

రైల్వే బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో ఏర్పడిన దిగ్భ్రమ నుంచి ఏపీ ప్రజలు తేరుకోకముందే కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా మరో షాకిచ్చింది కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి తగిన నిధులు, పారిశ్రామిక సౌకర్యాల కల్పనకు, మౌలిక సౌకర్యాలకు నిధులు, రాయితీలు ఇస్తామని చట్టంలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో ప్రకటించింది.

Arun Jaitley budget: Pawan Kalyan meets Chandrababu

దీంతో, తొలి బడ్జెట్‌లోనే ఏపీకి న్యాయం చేస్తారని అంతా భావించారు. కానీ, అప్పట్లోనే తీవ్ర నిరాశ మిగిల్చారు. అయితే, అధికారంలోకి వచ్చి నెల రోజులు మాత్రమే కావడం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఈసారి బడ్జెట్‌పై ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఏపీకి న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అక్కడి నేతలను కోరిన నేపథ్యంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ, శనివారం జైట్లీ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి చట్టబద్ధంగా చేసిన హామీలకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించడం మినహా ఎటువంటి నిర్దిష్ట ప్రకటన లేకపోవడంపై అటు ప్రజా ప్రతినిధులతోపాటు ఇటు ప్రజలూ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఇక, రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితర భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని చట్టంలో పేర్కొన్నా బడ్జెట్‌లో వాటికి కేటాయింపులు ఏమీ లేవు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు హామీ ఇచ్చినట్లే పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని చేసిన ప్రకటన కూడా బడ్జెట్‌ పత్రాలను చదివిన తర్వాత ఉత్తుత్తి వాగ్దానమేనని తేలిపోయింది.

మరో విశేషం ఏమిటంటే, విభజన చట్టంలోనే నవ్యాంధ్రకు ఐఐఎంను కేటాయించారు. దానికి శంకుస్థాపన చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులూ ప్రారంభం కానున్నాయి. కానీ, ఈ ఐఐఎంను రాష్ట్రానికి తాజాగా కేటాయించినట్లు అరుణ్‌ జైట్లీ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని మోసం చేస్తే ఇప్పుడు ప్రధాని మోడీ ప్రభుత్వం వారిని నమ్మించి ద్రోహానికి పాల్పడిందంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+