చంద్రబాబు తెగించారా?: అన్యాయం జరగదు, చాలా ఇస్తామన్న జైట్లీ
అమరావతి: బడ్జెట్‌లో ఏపీకి మొండి చెయ్యి, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై సీఎం చంద్రబాబు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం జైట్లీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
‘‘విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకంగా హామీలు ఇచ్చారు. బడ్జెట్ లోటు పూడుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా అడిగితే దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. చివరకు ఏదీ లేదు. ఇలాగైతే ఎలా? రాజధానిని కోల్పోయిన రాష్ట్రం ఎలా నిలదొక్కుకొంటుందని అనుకొంటున్నారు? మమ్మల్ని ఇతర రాష్ట్రాలతో ఎలా పోలుస్తారు? ఆ రాష్ట్రాలకు మాకు ఇచ్చినట్లుగా చట్టబద్ధమైన హామీలు ఉన్నాయా?'' అని అడిగారని తెలుస్తోంది.
Also Read: కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి: జైట్లీ బడ్జెట్‌పై చంద్రబాబు ఆసంతృప్తి
తాను ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ... హామీ ఇచ్చి పంపుతున్నారని గుర్తు చేశారు. ఎన్డీయే హయాంలో మూడు బడ్జెట్లు ముగిసినా తమకు ఒరింగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబుకు సర్దిచెప్పేందుకు జైట్లీ ప్రయత్నించారు.

‘‘వేరుగా అనుకోవద్దు. రాష్ట్రాలకు చేసే కేటాయింపులను మేం బడ్జెట్లో చూపలేదు. ఏపీకి ఇవ్వాల్సిన వాటిపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఏ రాష్ట్రానికి ఏం ఇచ్చేది విడిగా ప్రకటిస్తామని చెప్పారు. మిమ్మల్ని నిరాశపర్చం'' అని జైట్లీ హామీ ఇచ్చారని సమాచారం.
కేంద్రం తీరుతో ఏపీకి నష్టం కలుగుతుందని భావించిన సీఎం చంద్రబాబు ఇంకా మౌనంగా ఉండటం మంచిదికాదని, పార్టీ వేదికపై గట్టిగా మాట్లాడతానని పార్టీ నేతలతో చెప్పినట్లు తెలిసింది. జైట్లీతో మాట్లాడిన అనంతరం చంద్రబాబుకు కాస్తంత ఊరట కలిగింది.
‘కేంద్ర బడ్జెట్‌లో నిధులు తక్కువ ఇచ్చారు. ప్రధాని మోడీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి అనేకసార్లు చెప్పా. పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు చేయూతనివ్వాలని కోరాను. నావేమీ గొంతెమ్మ కోరికలు కాదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలేనని కూడా వివరించా. అయినా బడ్జెట్‌లో అనుకున్నంత రాలేదు'' అని చంద్రబాబు పార్టీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘విభజన చట్టంలో రెవెన్యూ లోటు పూడుస్తామన్నారు. రాజధానికి సహాయం చేస్తామన్నారు. రైల్వే జోన్, సీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరానికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని కూడా ప్రకటించారు'' అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు గుర్తుచేశారు.
Also Read: బడ్జెట్: ధరలు తగ్గనున్నవి, పెరగనున్నవీ.., పన్ను చెల్లించే వారికి ప్రయోజనాలివే..
ఉదయాన్నే జైట్లీతో మాట్లాడానని చెప్పిన చంద్రబాబు, రాష్ట్రానికి తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని పార్టీ నేతలకు తెలిపారు. అయితే... ఈ వైఖరిపై టీడీపీ నేతలు సంతృప్తి చెందలేదు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ ఇంతవరకూ రానందున కొంత గట్టిగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
ఈలోపే ఢిల్లీలో ఉమా భారతి ప్రకటన వెలువడింది. పోలవరం ప్రాజెక్టుకు 1600 కోట్లు ఇస్తామని ఆమె ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఇక కేంద్రంపై విమర్శల చేయలేదు. ‘‘కేంద్రంతో మనకు అనేక అవసరాలు ఉన్నాయి. రావాల్సిన వాటి కోసం వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తూనే ఉంటాం. అవసరమైతే సీఎం ఇంకో నాలుగుసార్లు వెళ్తారు. మన మనోగతాన్ని వారు గుర్తించినట్లు కనిపించింది. అందుకే స్వరం తగ్గించాం'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు అన్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications