వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం: తేడాగా ఉంది.. చంద్రబాబు 'లెక్క'పై అరుణ్ జైట్లీ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు చట్ట ప్రకారం నిధులు అందిస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Recommended Video

Polavaram Project : కేవీపీ పిటిషన్‌ : కేంద్రం, బాబు కు చెక్ !

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు నేతృత్వంలో పలువురు నాయకులు జైట్లీని కలిశారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు సహకరించాలని కోరారు. అదే సమయంలో ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలు వివరించారని తెలుస్తోంది.

చట్ట ప్రకారం నిధులు ఇస్తాం

చట్ట ప్రకారం నిధులు ఇస్తాం

పోలవరం ప్రాజెక్టుకు చట్ట ప్రకారం నిధులు ఇస్తామని జైట్లి వారికి చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పోలవరంకు నిధులు, లోటు భర్తీతో పాటు ప్రత్యేక ప్యాకేజీ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి.

నువ్వు అన్న కాదు!: జగన్ చెప్పిన మాటతోనే ఆదినారాయణ రెడ్డి కౌంటర్నువ్వు అన్న కాదు!: జగన్ చెప్పిన మాటతోనే ఆదినారాయణ రెడ్డి కౌంటర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల్లో వ్యత్యాసం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల్లో వ్యత్యాసం

లోటు ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు వ్యత్యాసం వస్తోందని, అవకాశం ఉన్నంత వరకు త్వరగా పూర్తి చేస్తామని అరుణ్ జైట్లీ బీజేపీ నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. తద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలపై కేంద్రం అసంతృప్తిగా ఉన్నట్లుగా ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఇది టిడిపికి షాక్ అని చెప్పవచ్చు.

బీ రెడీ! పవన్‌ కళ్యాణ్‌కు వాపు-బలుపు తెలుసు, అక్కడ బలంపై టీడీపీ-వైసీపీ ఆరాబీ రెడీ! పవన్‌ కళ్యాణ్‌కు వాపు-బలుపు తెలుసు, అక్కడ బలంపై టీడీపీ-వైసీపీ ఆరా

ప్రత్యేకప్యాకేజీ నిలబెట్టుకుంటాం

ప్రత్యేకప్యాకేజీ నిలబెట్టుకుంటాం

పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని జైట్లీ బీజేపీ నేతలతో అన్నారని తెలుస్తోంది. అలాగే ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇస్తామని చెప్పారు. బీజేపీ ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన వారికి చెప్పారని తెలుస్తోంది.

టీడీపీ-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

టీడీపీ-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

కాగా, పోలవరం ప్రాజెక్టు నిధులపై ఇటీవల బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి వచ్చిన లేఖపై స్వయంగా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఓ అధికారి వల్ల ఇలా జరిగిందని, కేంద్రం విషయంలో ఓ మెట్టు దిగారు.

English summary
Union Minister Arun Jaitley shocks Andhra Pradesh Chief Minister Chandrababu Naidu over Polavaram Project issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X