ఏపీకీ హోదా లేనట్లే!: లోక్‌సభలో జైట్లీ, 'అండగా నిలిచాం, ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇస్తాం'

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అండగా నిలిచామని లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదాపై కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది మేం కాదని... యూపీఏ ప్రభుత్వమని చెప్పారు. యూపీఏ ఇచ్చిన హామీలను కూడా మేమే నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రతిపైసాను లెక్కకట్టి మరీ ఇస్తామని అన్నారు. తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు గాను రూ. 2800 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు విభజన చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 6403 కోట్లు ఇచ్చామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరానికి కూడా నిధులిచ్చామని స్పష్టం చేశారు.

Arun Jaitly speaks about andhra pradesh special status in loksabha

పోలవరం నిధులపై కేంద్రం వెనుకంజ వేయలేదని అన్నారు. పోలవరంపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని... ఆ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. పోలవరం అంశాన్ని జైట్లీ ప్రస్తావించగానే ఒడిశా ఎంపీలు ఆందోళనకు దిగారు. మా సంగతేంటని జైట్లీని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిని జిల్లాలకు కూడా నిధులిచ్చామని ఆయన పేర్కొన్నారు. 42 శాతం నిధులన్నీ రాష్ట్రాలకే కేటాయిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు 14వ ఆర్ధిక సంఘం సిఫారసులకు అనుగుణంగా నిధులిచ్చామని చెప్పారు. నాబార్డు ద్వారా కూడా ఇవ్వాల్సిన నిధులన్నీ ఇస్తున్నామని అన్నారు.

లోక్ సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచనే కేంద్రానికి లేనట్టు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+