మళ్లీ పరువు తీయకు!: షూ కొనుక్కోమని కేజ్రీవాల్‌కి రూ.364 డిడి పంపిన ఇంజినీర్
విశాఖ/న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు విశాఖకు చెందిన ఓ ఇంజినీర్ ఝలక్ ఇచ్చారు. విదేశీయుల ముందు కాస్త డిగ్నిటీగా ఉండాలంటూ సూచించారు. అంతేకాదు 364 రూపాయల డిడిని కేజ్రీవాల్‌కు పంపించారు.
అతను కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖతో పాటు ఆ డబ్బును పంపించారు. ఆ లేఖను, డిడిని పంపిన వారు సుమిత్ అగర్వాల్ అనే ఇంజినీర్. తాను పంపిన ఆ డబ్బులతో మంచి షూ జతను కొనుక్కోవాలని సూచించారు.
అతను తన లేఖలో కేజ్రీవాల్ తీరు పైన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్ పరువు తీయవద్దని సున్నితంగా పేర్కొన్నారు. నీ వేషధారణ ద్వారా సాధారణ భారతీయుడిలా (కామన్ మ్యాన్)లా అని చెబుతూ పరువు తీయవద్దని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో ఆ రోజున విందు ఇచ్చారు. దీనికి కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండే కూడా ఈ విందుకు వచ్చారు.
ఈ విందులో కేజ్రీవాల్ తీరును ఉద్దేశించి సదరు ఇంజినీర్ లేఖ రాశారు. అతను ఆ లేఖలో... విదేశీయుల ముందు కనీసం ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నారు.
మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఆ లేఖలో.. మీరు, ఫ్రెంచ్ అధ్యక్షులు హోలాండే రాష్ట్రపతి భవన్లో విందుకు హాజరయ్యారు. అక్కడ మీరు సాండిల్స్ వేసుకున్నారు. ఇది నన్ను కలచివేసింది. అలా మీరు ఉన్నందుకు బాధపడ్డానని అందులో పేర్కొన్నారు. దానికి డిడిని జత చేసి పంపారు.
Posted by Sumit Agrawal on Monday, February 1, 2016












Click it and Unblock the Notifications