• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మెగా సిటీ: కీలక దశకు నూతన అమరావతి

|

అమరావతి: కృష్ణా నది ఒడ్డున విజయవాడ సమీపంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కీలకమైన మౌలిక వసతుల నిర్మాణాలు జోరందుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి మారిన తర్వాత ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

సింగపూర్ నుంచి తెప్పించుకున్న మాస్టర్ ప్లాన్ సహాయంతో ల్యాండ్ పూలింగ్‌ను మొదటి సంవత్సరంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్‌లో 217కి.మీల గ్రీన్ ఫీల్డ్ సిటీకి అడుగులు పడ్డాయి. ఇప్పుడు రహదారుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

అమరావతికి గుండెకాయలాంటి విజయవాడకు కలిపే రోడ్డు మార్గాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం అనేకమంది నిర్మాణ సిబ్బంది, యంత్రాలను ఉపయోగించడం జరుగుతోంది. పలు కీలక రోడ్లకు ఫేజ్ 1 కింద ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏపీ సీఆర్‌డీఏ) ఇప్పటికే టెండర్లు వేసింది.

ప్రపంచ బ్యాంక్, హడ్కో, ఏపీసీఆర్‌డీఏ 2.2బిలియన్ డాలర్ల నిధులతో ఫేజ్1లో కీలకమైన మౌలిక సదుపాయాలు, ఎకనామిక్ ప్రాజెక్టులను ఈ యేడాదిలోగా పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజధాని అమరావతి నగరంలో 35మిలియన్ల జనాభా ఉండే అవకాశం ఉంది. 2035 వరకు ఈ నగరం 3.31 మిలియన్ ఉద్యోగాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

మూడేళ్లలో 50శాతం

మూడేళ్లలో 50శాతం

వచ్చే 20ఏళ్లలో రూ. 58,000కోట్లతో అమరావతిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 50శాతం నిధులను వచ్చే మూడేళ్లలోనే ఉపయోగించనున్నారు. రాజధాని నగర నిర్మాణంతోపాటు రోడ్ల కోసం రైతులు సుమారు 33,000 ఎకరాల భూములను ఇచ్చేశారు. దేశంలోనే ఇంతపెద్ద మొత్తంలో భూమిని రైతులు ప్రభుత్వానికి అందజేయడం ఇక్కడే జరిగింది. రైతులకు అందజేసే నివాస, కమర్షియల్స్ ప్లాట్స్ దాదాపు పూర్తయ్యాయి. తిరిగివ్వనున్న 17000 ఎకరాల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.7000లకోట్లను పెట్టుబడిగా పెడుతోంది. 95శాతం నివాస భూములు, 50శాతం కమర్షియల్ భూములు సిద్ధమయ్యాయి. డెవలపర్స్, రైతులతో కలిసి అభివృద్ధి పనులు ఇక్కడ జరగనున్నాయి.

8నెలల్లోనే ఐజీసీ

8నెలల్లోనే ఐజీసీ

గత ఏడాది అక్టోబర్‌లోనే ప్రభుత్వం ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్(ఐజీసీ)ని ఏర్పాటు చేసింది. ఇక్కడ్నుంచి పలు ఆర్థిక లావాదేవీలు జరగనున్నాయి. ఇప్పటికే ఐజీసీ నుంచి సుమారు 6వేల మంది ఉద్యోగులు పని చేయడం ప్రారంభించారు. 6లక్షల స్క్వేర్ ఫీట్ల ఆరు బ్లాకులను ఎనిమిది నెలల్లోనే పూర్తి చేయడం గమనార్హం.

కాగా, వచ్చే రెండేళ్లలో మౌలిక వసతుల కల్పన వేగం పెరగనుందని ఏపీ సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ఫేజ్ 1లో లాగానే కొన్ని మేజర్ ఎకనామిక్ ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. 1400 ఎకరాల్లో ప్రధాన ప్రభుత్వ కాంప్లెక్స్, రాజ్ భవన్, హైకోర్టు, లేజిస్టేచర్, సెక్రటేరియట్, సీఎం బంగ్లా, మంత్రుల నివాసాలు, ఇతర అధికారులు నివాసాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

ఐకానిక్ స్ట్రక్చర్లు..

ఐకానిక్ స్ట్రక్చర్లు..

అమరావతి నగరానికి తలమానికంగా రెండు ఐకానిక్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేయనున్నారు. నోర్మన్ ఫోస్టర్, బ్రిటన్ పాట్నర్స్ ప్రధాన అర్కిటెక్ట్‌గా పని చేయనున్నారు. మొత్తం కాంప్లెక్స్ డిజైన్, అర్కిటెక్చర్ వారే సమకూర్చనున్నారు.

6.8స్క్వేర్ కి.మీ ప్రాంతంలో ప్రైమ్ ఎకనామిక్ హబ్‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఏపీసీఆర్‌డీఏ పేర్కొంది. మాస్టర్ డెవలపర్ ఎంపిక తర్వాత ప్రభుత్వ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో కీలక నిర్మాణాలు జరగనున్నాయి. గ్లోబల్ దిగ్గజ సంస్థలకు వేలం పద్ధతిన భూములను అందించనున్నారు.

పూర్తికావొస్తున్నాయి..

పూర్తికావొస్తున్నాయి..

‘రాజధాని నగరంలో పలు భవనాలు పూర్తికావొస్తున్నాయి. మౌలిక వసతులు, కనెక్టివిటీతో పూర్తిస్థాయిలో రాజధాని నగరంగా నిర్మించడం పెద్ద సవాలే' అని ఏపీసీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ వి రామమనోహర రావు మీడియాకు తెలిపారు. రాజధాని నగరంలోనే జస్టిస్, స్పోర్ట్స్, నాలెడ్జ్, ఎలక్ట్రానిక్, మీడియా, టూరిజం, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, ఫైనాన్స్ లకు సంబంధించి 9నగరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ సిటీకి ఒక యాంకర్‌ను గుర్తిస్తున్నట్లు పేర్కొంది.

మెగాసిటీగా..

మెగాసిటీగా..

ఈ రాజధాని నగరం మెగా సిటీగా రూపాంతరం చెందేందుకు 30 నుంచి 40ఏళ్ల వరకు పడుతుందని, ప్రస్తుతం అదే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ‘ఫిజికల్ మాస్టర్ ప్లాన్ రికార్డ్ టైంలో సిద్ధమైంది. ఇక ప్రజలు రావడమే తరువాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లకు సంబంధించిన కార్యకలాపాలు, యూనివర్సిటీల ఏర్పాటు కీలకం' అని ఏపీ సీఆర్ డీఏ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ వై నాగిరెడ్డి తెలిపారు.

విద్యాసంస్థలు

విద్యాసంస్థలు

వీఐటీ యూనిర్సిటీ ఇప్పటికే తన క్యాంపస్‌లో పని ప్రారంభించిందని తెలిపారు. ఈ సంవత్సరం నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిపారు. ఎస్ఆర్‌వీఎం యూనివర్సిటీ కూడా ఈ ఏడాది నుంచే విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. అమృత యూనివర్సిటీ మాత్రం వచ్చే ఏడాది నుంచి క్లాసులను ప్రారంభించనుందని తెలిపారు.

కీలక సంస్థలు..

కీలక సంస్థలు..

దుబాయ్ కి చెందిన బీఆర్ శెట్టి గ్రూప్ రూ.1000 కోట్లను మెడీ సిటీ ప్రాజెక్ట్ కోసం వెచ్చించనుంది. ఇందులో స్టెమ్ సెల్స్ యూనిట్, ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఓ స్టార్ హోటల్ ఏర్పాటు కానుంది. ది ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు 150 ఎకరాలను కేటాయించడం జరిగింది. ఇందులో మెడికల్ కాలేజీతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లకు భూమి కేటాయించడం జరగగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(ఎన్ఐఎఫ్ టీ) కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The development of Andhra Pradesh's new capital Amaravati on the banks of the Krishna river near Vijayawada has entered the execution phase -- with the focus now shifting to creating critical infrastructure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more