వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు బాబు ప్రాధాన్య‌త ..! ఏపీ క్యాబినెట్ లోకి రెండు కొత్త మొఖాలు..!

హైద‌రాబాద్ : ఎప్ప‌టినుండో వాయిదా పడుతూ వ‌స్తోన్న ఆంద్ర‌ప్ర‌దేశ్ మంత్రి మండ‌లి కూర్పుకు ముహూర్తం కుదిరింది. ఏపిలో ఇద్ద‌రు అభ్య‌ర్థును మంత్రిమండ‌లిలోకి తీకునేందుకు ఏపీ సీయం చంద్ర‌బాబు నాయుడు సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మంత్రి మండ‌లి విస్త‌ర‌ణ‌లో ఈ సారి వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన‌త్య ఉంటుంద‌ని గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీ ప్ర‌కార‌మే అభ్య‌ర్థులను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

పార్టీకి సుధీర్ఘ‌కాలం సేవ‌లందిస్తూ వివాద ర‌హితుడుగా పేరుతెచ్చుకున్న‌మైనారిటీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఫ‌రూఖ్ తో పాటు, ఇటీవ‌ల మావోయిస్టుల చేతిలో హ‌త‌మైన గిరిజ‌న సామా.ఇక వ‌ర్గానికి చెందిన అర‌కు ఎమ్మెల్యే స‌ర్వేశ్వ‌ర‌రావు కుమారుడు శ్ర‌వ‌ణ్ కు కూడా మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్సించ‌బోతున్నారు చంద్ర‌బాబు. దీంతో గ‌తంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాధాన్య‌త క‌ల్పిస్థామ‌న్న చంద్ర‌బాబు హామీని నిల‌బెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌న‌కు ముహూర్తం ఖ‌రారు..! రేపే రెండు కొత్త ముఖాలకు చోటు..!!

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌న‌కు ముహూర్తం ఖ‌రారు..! రేపే రెండు కొత్త ముఖాలకు చోటు..!!

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ కాజ‌కీయ ప‌రిణామాల నేప‌ధ్యంలో విడిపోయిన సంగతి తెలిసిందే. ఏపీ హక్కుల విషయంలో కేంద్రం మోసం చేసిందనే కారణంతో టీడీపీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసింది. దీంతో కేంద్ర కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రులు, ఏపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులు రాజీనామాలు చేశారు. కేంద్రం సంగతి పక్కన పెడితే, ఏపీ కేబినెట్‌లో ఆ రెండు శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. చంద్రబాబు కేబినెట్ విస్తరణ ఉంటుద‌ని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా అనివార్య‌కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

 ఎప్ప‌టినుండో వాయిదా ప‌డుతున్న‌క్యాబినెట్ విస్త‌ర‌ణ..! ఎట్ల‌ట‌కేల‌కు ఓకే అన్న బాబు..!!

ఎప్ప‌టినుండో వాయిదా ప‌డుతున్న‌క్యాబినెట్ విస్త‌ర‌ణ..! ఎట్ల‌ట‌కేల‌కు ఓకే అన్న బాబు..!!

బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో ఖాళీ అయిన ఈ రెండు శాఖలకు ఇద్దరు కొత్త వారిని తీసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, గ్ర‌హ‌బ‌లం లేక‌నే., ముహూర్త‌బ‌లం లేక‌నో ఆ కార్యం కాస్తా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి కేబినెట్ విస్తరణ తెరపైకి వచ్చింది. అంతేకాదు, దీనికి చంద్రబాబు నిర్దారించిన తేదీ తో పాటు ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు..? అనే విషయాలు బయటికి వచ్చాయి. దీంతో కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లైంది.

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన్యం..! స‌మన్య‌యం పాటించిన బాబు..!!

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన్యం..! స‌మన్య‌యం పాటించిన బాబు..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ విస్తరణకు నవంబర్ 11వ తేదీని ఫైన‌లైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రెండు శాఖలను భర్తీ చేయబోతున్నారని స‌మాచారవం. ఈ రెండు శాఖల్లో ఒకటి మైనారిటీ సామాజిక వర్గానికి, మరొకటి ఎస్టీ సామాజికవర్గానికి కేటాయించినట్లు తెలిసింది. మైనారిటీ కోటాలో టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిలో ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్నారు. మరో ఎమ్మెల్సీ షరీఫ్‌ ప్రస్తుతం మండలి నుంచి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు.

కిడారి త‌న‌యుడికి చోటు..! నిస్వార్థ సేవ‌కు గుర్తింపు ఉంటుందంటున్న చంద్ర‌బాబు..!

కిడారి త‌న‌యుడికి చోటు..! నిస్వార్థ సేవ‌కు గుర్తింపు ఉంటుందంటున్న చంద్ర‌బాబు..!

వీరిలో ఫరూక్‌నే చంద్రబాబు ఫైనల్ చేశారని తెలుస్తోంది. అలాగే ఎస్టీ కోటాలో ఇటీవల మావోల చేతిలో హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ‌్‌కు చోటు కల్పించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు, ఫరూక్‌కు వైద్య, ఆరోగ్య శాఖ.. శ్రవణ్‌కు దేవాదాయ శాఖ అప్పగించబోతున్నారట. వీళ్ల ఎంపికతో ఈ రెండు సామాజికవర్గాలను కూడా మంత్రి వర్గంలో భర్తీ చేసినట్లు అవుతుందనే కారణంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాబు నిర్దారించిన ముహూర్తానికైనా మంత్రులుగా ప్ర‌మాణం చేస్తారా మ‌రో ఆటంకం తో ఆగిపోతుందా చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+