
బీజేపీ గెలుపుతో జగన్ చేతికి అస్త్రం -అడకత్తెరలో కేంద్రం -ఏపీలో మళ్లీ హోదా ఉద్యమం? వైసీపీ గేమ్!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితమూ వెలువడింది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అనివార్యంగా జరిగిన తిరుపతి బైపోల్ లో అదే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఏకంగా 2.71లక్షల మెజార్టీతో గెలుపొందారు. 23నెలల పాలనకు రిఫరెండంగా తిరుపతిలో దక్కిన విజయం అపూర్వమైనదని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాగా, జగన్ ప్రమేయం లేకుండానే పొరుగున వెలువడిన ఎన్నికల ఫలితాలతో ఏపీకి సంబంధించి ఆయన చేతికి కొత్త అస్త్రం దొరికినట్లయింది..
మోదీ
చేతిలో
దీదీ
జుట్టు
-సీఎం
పదవికి
'గవర్నర్'
గండం
-రాత్రి
7కు
భేటీ
-నందిగ్రామ్
ఓటమితో
చిక్కులు

పుదుచ్చేరిలో బీజేపీ విజయంతో
ఏపీలో అంతర్భాగంగా ఉండే యానం సహా అది కొలువైఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యరీతిలో వెలువడ్డాయి. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్, ద్రవిడ పార్టీలకు కంచుకోటగా ఉన్న పుదుచ్చేరిలో తొలిసారి కాషాయ జెండా ఎగరింది. ఎన్ఆర్ కాంగ్రెస్ తో కలిసి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే కూటమి ఏకంగా 16 సీట్లతో సాధారణ మెజార్టీ సాధించింది. ఇండిపెండెట్లు 6 చోట్ల, డీఎంకే 6 సీట్లు గెలవగా, కాంగ్రెస్ కేవలం 2సీట్లకే పరిమితం అయిపోయింది. కాగా, పుదుచ్చేరిలో గెలుపు కోసం బీజేపీ ఇచ్చిన కీలక హామీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పాలిట అస్త్రంగా మారనుంది..

ప్రత్యేక హోదాకు బీజేపీ హామీ..
పుదుచ్చేరిలో బీజేపీ-ఎన్ఆర్ కాంగ్రెస్-అన్నాడీఎంకే కూటమి విజయానికి ప్రధాన కారణం నారాయణ స్వామి నేతృత్వంలోని గత కాంగ్రెస్ సర్కారు వైఫల్యం ఒక ఎత్తయితే, బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రత్యేక హోదా అంశం మరో ఎత్తు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రత్యేక హోదా ఎంతో కీలకమైతేకాదు, దానిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. సాక్ష్యాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న మార్చిలో పుదుచ్చేరి గడ్డపై నిలబడి మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ''పుదుచ్చేరిలో బీజేపీ సర్కారు ఏర్పాటైతే, కేంద్రంలోని మోదీ సర్కార్.. పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తుంది'' అని నిర్మల స్పష్టం చేశారు. ఆదివారం నాటి ఫలితాలతో పుదుచ్చేరిలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినట్లయింది. ఇక ప్రత్యేక హోదానే రావాల్సి ఉంది. కాగా,

ఏపీకి హోదాపై మరో ఉద్యమం..
పుదుచ్చేరికి ప్రత్యేక హోదా కల్పిస్తామని గెలుపొందిన బీజేపీ ఆ మేరకు ప్రస్తుతం 25 శాతంగా ఉన్న కేంద్రం నిధులను 40 శాతానికి పెంచడానికి, ఇప్పుడు 30:70గా ఉన్న పుదుచ్చేరి, కేంద్రం నిధులను 70:30గా సవరించడానికి ఇప్పటికే సిద్ధమైంది. బీజేపీ-ఎన్ఆర్ కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వెంటనే ఢిల్లీలో ఈ మేరకు కదలికలు రానున్నాయి. మరి పుదుచ్చేరికి హోదా సిద్ధంకాగా, విభజన హామీగా ఏపీకి దక్కిన ప్రత్యేక హోదా హామీ అంశం మరోసారి తెరపైకొచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, నీతి అయోగ్ కారణంగా ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం, బీజేపీ పదే పదే చెబుతూ వచ్చినా, ఇప్పుడు పుదుచ్చేరికి హోదా కల్పిస్తుండటంపై ఏపీలో మరో ఉద్యమానికి అవకాశం లేకపోలేదు. ఆశించకుండానే జగన్ చేతికి దక్కిన ఈ అస్త్రాన్ని కేవలం బీజేపీని ఇరుకున పెట్టడానికే వాడుకుంటారో, చిత్తశుద్ధితో ఏపీకి హోదానే రాబడతారో వేచిచూడాలి. ఏపీని మొండి చేయి చూపినట్లే హోదా విషయంలో పుదుచ్చేరికి సైతం బీజేపీ మొండిచేయి చూపిస్తే అది వేరే విషయం.
జగన్
మద్దతిచ్చినా
'సీఎం'
ఓటమి
-యానాంలో
రంగస్వామి
పరాజయం
-పుదుచ్చేరిలో
ఎన్డీఏ
గెలుపు