ఏపీ, తెలంగాణాపై మాండూస్ ఎఫెక్ట్ కొనసాగుతుండగానే .. ముంచుకొస్తున్న మరో తుఫాను
మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరో తుఫాను ముంచుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.

ముంచుకొస్తున్న మరో తుఫాను.. ఈసారి ఎక్కడంటే
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఈ నెల 13వ తేదీన ఏర్పడనున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
దీంతో ఇప్పుడు మరోమారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. శ్రీలంకను ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని డెల్టా జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మాండూస్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు
దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా డిసెంబర్ 13, 14 తేదీలలో అండమాన్ నికోబార్ లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడులోని మామల్లపురం లో ఆదివారం రాత్రి మాండూస్ తుఫాను తీరం దాటడంతో తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా కెవిబిపురం మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. చెన్నైలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడగా, విపరీతంగా వీస్తున్న ఈదురు గాలులు వల్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇప్పటివరకు ఈ తుఫాన్ కారణంగా ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.

రైతన్నలకు వరుస తుఫాన్ల దెబ్బ.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమై అవసరమైనచోట సహాయక చర్యలు చేపడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ మాండూస్ తుఫాన్ ప్రభావంతో అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. మాండూస్ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక ప్రస్తుతం వస్తున్న తుఫానులు, కురుస్తున్న అకాల వర్షాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అన్నదాతల కంట కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం కుప్పలు గా పోసుకొని, కొనుగోళ్ల కోసం రైతులు దిగాలుగా ఎదురుచూస్తున్నారు. వరుస తుఫాను హెచ్చరికల నేపధ్యంలో త్వరగా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications