Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ మాట తప్పాడు.. గద్దె దింపటం మాకు తెలుసు...ఆశావర్కర్ల ఆగ్రహ జ్వాలలు

Recommended Video

    జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఆశావర్కర్ల ధర్నా || ASHA Workers Hold Massive Dissent In Vijayawada

    ఏపీలో అశావర్కర్లు జగన్ సర్కార్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా నెలకు రూ.10 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆశా వర్కర్ లు ఎపిలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఛలో అమరావతికి పిలుపిచ్చిన వారంతా.. రైళ్లు, బస్సుల్లో విజయవాడకు బయలు దేరారు. ఐతే.. వీరిని స్టేషన్లలోనే అడ్డుకున్నారు పోలీసులు. శాంతిభద్రతల కారణం చూపిస్తూ ఎక్కడికక్కడ నిలువరించారు. తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అమరావతిలో నిరసన తెలపాలని నిర్ణయించుకున్న ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

    ఛలో అమరావతికి బయలుదేరిన అశావర్కర్లను అరెస్ట్ చేసిన పోలీసులపై ఆశావర్కర్ల ఆగ్రహం

    ఛలో అమరావతికి బయలుదేరిన అశావర్కర్లను అరెస్ట్ చేసిన పోలీసులపై ఆశావర్కర్ల ఆగ్రహం

    తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకున్న ఆశా వర్కర్లను వేల మందిని అరెస్టు చేశారన్న వార్తలపై ఆశా వర్కర్ల సంఘం తీవ్రంగా మండిపడుతోంది. ధర్నా కోసం విజయవాడ వెళుతున్నారని తెలిసి గ్రామాలు, పట్టణాలలోని ఆశ వర్కర్ల ఇళ్లకు వెళ్లి మరీ అరెస్ట్‌ చేయడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . గత ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని, జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కోర్కెల సాధన కోసం నిరసన తెలుపుతున్న వారిని అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ జీతాలు బకాయిలు విడుదల చేయాలని, అంతేకాదు గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

    జగన్ మాట తప్పాడు .. మడమ తిప్పాడు అంటూ ఆశా వర్కర్ల ఫైర్

    జగన్ మాట తప్పాడు .. మడమ తిప్పాడు అంటూ ఆశా వర్కర్ల ఫైర్

    ఆశా కార్మికులు మాట్లాడుతూ, మాట తప్పను , మడమ తిప్పను అన్న జగన్ కు మేము ఓటు వేశామని మరియు అధికారంలోకి వచ్చిన తరువాత వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సిఎం అయ్యాక ఆయన మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు వరకు అంటూ వారు అంటున్నారు. తమపై ఈ రోజుల్లో రాజకీయ వేధింపులు పెరిగాయని వారు పేర్కొన్నారు . జగన్ ఆయనను నమ్మి ఓట్లేసిన మహిళా ఆశా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు . మా డిమాండ్లను నెరవేర్చకపోతే, అతన్ని సిఎం కుర్చీ నుండి ఎలా గద్దె దింపాలో మాకు బాగా తెలుసనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.

    గ్రేడింగ్ విధానంతో అసలుకే ఎసరు పెట్టారని ఆశాల ఆవేదన

    గ్రేడింగ్ విధానంతో అసలుకే ఎసరు పెట్టారని ఆశాల ఆవేదన

    వేతనాలను 10,000 రూపాయలకు పెంచుతామని జగన్ వాగ్దానం చేసాడు, కాని అతను గ్రేడింగ్ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగాలకే ఎసరు పెట్టాడని వారు లబోదిబో అంటున్నారు. ఇది పెరిగిన జీతాలను పొందటానికి ఇబ్బందిగా మారిందని ఆశా వర్కర్లు పేర్కొన్నారు .అకాడెమిక్ రికార్డులు ఉన్నవారు మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతారని ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. మేము ఆశా కార్మికులుగా చేరినప్పుడు మాకు కొంత ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వంపై నమ్మకం తప్ప మరేమీ లేదు. ఇప్పుడు ఈ విధమైన నియమాలు మమ్మల్ని నిరుద్యోగులుగా మారుస్తున్నాయని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది నెలల వేతనమే కాకుండా, అన్ని సంక్షేమ పథకాలు తమకు వర్తించేలా చూడాలనే డిమాండ్ ప్రధానంగా అశావర్కర్ల నుండి వినిపిస్తుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+