వీధి రౌడీల్లా గొడవలు: టి ఉద్యోగులపై అశోక్‌బాబు
చిత్తూరు: తెలంగాణ ఉద్యోగులపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఎన్జీవో భవనం విషయంలో తెలంగాణవారు రౌడీల్లా వ్యవహరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఎన్జీవో భవనం ఏపీకి చెందినదేనన్న విషయం వారికి తెలుసన్నారు.
అయినా, స్థానిక బలంతో వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం తీవ్ర ఆర్థికలోటులో ఉన్నప్పటికీ ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఉద్యోగుల అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువైన కారణంగా ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతోపాటు అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో జాప్యం జరిగితే ఆ క్యాడర్‌లో పనిచేసే ఉద్యోగులకిచ్చే జీతాలను వారికి ఇవ్వాలన్నారు. ఉద్యోగులు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఆరోగ్య కార్డులకు సంబంధించి ఉద్యోగులకు వైద్యసేవలు అందించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు 25 శాతం అధికంగా నిధులు ఇస్తామని చెప్పిన్పటికీ వారు ముందుకురావడం లేదని అశోక్ బాబు ఆరోపించారు.












Click it and Unblock the Notifications