ప్రయత్నిస్తున్నాం: హోదాపై అశోక్, టిడిపి అంగన్వాడీ ట్రేడ్ యూనియన్

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన తమ ప్రయత్నాలను ముమ్మరం చేశామని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు శుక్రవారం నాడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మా ప్రయత్నాలు మేం చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర చాలా నష్టపోయిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే, కర్నాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయన్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయమై కొంత ఆలస్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Ashok Gajapathi Raju says they are trying for special category to AP

22, 23 తేదీల్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం

ఈనెల 22, 23 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో సమావేశం కానున్నారు. రెండంకెల వృద్ధి సాధించడంపై కలెక్టర్లతో చర్చించనున్నారు.

తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమం కోసం కృషి చేసేందుకుగాను టిడిపి ఆధ్వర్యంలో తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్‌ను ఏర్పాటు చేసినట్లు ఏపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి శుక్రవారం తెలిపారు.

ఆమె వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో వివిధ ట్రేడ్‌ యూనియన్లను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యూనియన్‌ను నెలకొల్పామన్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సభ్యత్వాలను నమోదు చేయనున్నట్లు చెప్పారు. సభ్యత్వాల నమోదు అనంతరం మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+